Advertisement
టీ 20 ప్రపంచ కప్ 2022 సెమీస్ పోరులో టీమిండియాకు నిరాశ మిగిలింది. 15 ఏళ్ల నిరీక్షణకు తెరందించేందుకు, ఎన్నో కలలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీం ఇండియా, సెమీస్ లో పోరాటం ముగించి తిరుగు పయనం అయింది. ఆస్ట్రేలియా వేదికగా టి 20 వరల్డ్ కప్ 2022లో సూపర్ 12లో ఐదు మ్యాచ్ ల్లో నాలుగు విజయాలతో గ్రూప్ బి టాపర్ గా సెమీస్ చేరిన భారత్, ఆడిలైడ్ వేదికగా గత గురువారం ఇంగ్లాండ్ తో జరిగిన సెమీస్ లో పరాజయం పాలైంది. దీంతో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పై, రోహిత్ శర్మ కెప్టెన్సీ పై భారీ ట్రోలింగ్ కూడా జరుగుతుంది.
Advertisement
కాగా, టీమిండియా మ్యాచ్ లు ఓడిన సమయంలో క్రికెట్ అభిమానుల నుంచి ఇలాంటి విమర్శలు రావడం సహజమే కానీ, ఇంగ్లాండు పై 10 వికెట్ల తేడాతో ఓటమిపై మాత్రం తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా టీం ఇండియాను హేళన చేస్తూ, ఒక ట్వీట్ చేసింది. గురువారం ఇంగ్లాండ్ చేతుల్లో టీం ఇండియా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఒక ట్వీట్ చేసింది.
Advertisement
ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే మ్యాచ్ ఓడిన తర్వాత రెండు రోజులు టీమిండియా పై మండిపడిన క్రికెట్ అభిమానులు, ఇప్పుడు కొంత శాంతించి, గిన్నిస్ రికార్డు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టును అవమానించేలా ట్వీట్ చేయడం పై మండిపడుతున్నారు. ఇంతకీ గిన్నిస్ బుక్ సంస్థ ఏమని ట్వీట్ చేసిందంటే, ‘చరిత్రలో ఇదే అత్యంత సులువైన రన్ చేజా?’ అని ట్రీట్ చేసింది. ఈ ట్వీట్ పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రపంచంలో పలు రికార్డులను నమోదు చేసే సంస్థ, ఒక క్రికెట్ జట్టును ఇలా అవమానించేలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
READ ALSO : Ravindra Jadeja: పాపం జడేజా.. బీజేపీ నుంచి భార్య.. కాంగ్రెస్ నుంచి సోదరి..
Easiest run chase in history? 👀#INDvsENG
— Guinness World Records (@GWR) November 10, 2022