Advertisement
భారత్-కెనడాల మధ్య ఉద్రికత్త వాతావరణం రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుందనే చెప్పాలి. ముఖ్యంగా భారత్ కి కెనడాతో ఉన్న సంబంధాలు దాదాపు తెగిపోతున్నాయి. కెనడా ప్రధాని ట్రూడో ఖలిస్థాన్ ఉ*వాది విషయంలో చేసిన ఆరోపణలను భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో కెనడాలోని హిందువులందరూ ఇండియాకి వెళ్లిపోవాలని..ఖలిస్థాన్ వేర్పాటు వాది గురుపత్వంత్ హెచ్చరికలు జారీ చేశారు. వార్నింగ్ ను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
Advertisement
అందుకే అమృత్ సర్ జిల్లా ఖాన్ కోట్ లో ఉన్న అతని వారసత్వ వ్యవసాయ భూమిని ఛండిగఢ్ లో ఉన్న ఇల్లును ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇక మీదట అవి ప్రభుత్వానివని ప్రకటించింది. వాస్తవానికి గురపత్వంత్ సింగ్ పేరిట ఉన్న ఆస్తులను 2020లోనే అటాచ్ చేసింది భారత్ ప్రభుత్వం. అప్పటినుంచి ఆస్తుల కోసం లీగల్ సెల్ గ్రూపు ద్వారా అతను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఎన్ఐఏ చర్యతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్టయింది. మరోవైపు గురుపత్వంత్ మీద పంజాబ్ 22 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అందులో మూడు దేశ ద్రోహం కేసులు కూడా ఉన్నాయి. కెనడాలో ఉంటున్న గురుపత్వంత్ ను ఉ*వాది అని భారత ప్రభుత్వం 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది.
Advertisement
వీటిని కూడా చదవండి: పవన్ కళ్యాణ్ కి అతి పెద్ద పరీక్ష ! ఇది నిజంగా ఒక పెద్ద సమస్యే !
అతనికోసం ఇంటర్ పోల్ కి రెడ్ నోటీస్ సైతం విజ్ఞప్తి చేసింది. సరైన సమాచారం లేదనే కారణంగా ఇంటర్ పోల్ దానిని తోసిపుచ్చింది. అప్పటినుంచి గురుపత్వంత్ గురించి ఇండియా.. కెనడాను హెచ్చరిస్తుంది. ఆ దేశం మాత్రం సరిగ్గా స్పందించలేదు. మరోవైపు కెనడా-భారత్ ల మధ్య ఉద్రిక్తతల మధ్య మిత్ర దేశం అమెరికా ఎప్పటికప్పుడూ స్పందిస్తూనే ఉంది. తొలినుంచి కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలను అమెరికా ఖండిస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. రెండు దేశాలు తమకు ముఖ్యమైనవే అయినా ఒకవైపు నిలబడాల్సి వస్తే భారత్ వైపే ఉంటామని తేల్చి చెప్పారు వైట్ హౌస్ అధికారులు. భారత్ లాంటి బలమైన దేశాన్ని సవాల్ చేయడం అంత మంచి విషయం కాదని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వీటిని కూడా చదవండి: చంద్రబాబు గారు విడుదల అవ్వాలంటే చివరగా మిగిలింది ఈ ఒక్క మార్గమేనా ? రంగం లోకి..!