Advertisement
హనుమాన్ చాలీసా ని చాలా మంది రోజు చదువుతూ ఉంటారు. హనుమాన్ చాలీస చదివితే చక్కటి ప్రయోజనాలని పొందచ్చని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తులసి దాస్ అందించిన హనుమాన్ చాలీస్ ని చదివితే శని ప్రభావం పోతుందట. హనుమాన్ చాలీసాని చదవడం వలన చదివే వ్యక్తి అద్భుత ప్రభావం పడుతుంది. పొద్దున్నే కానీ రాత్రి కానీ హనుమాన్ చాలీసా చదువుకోడానికి మంచి సమయం. రాత్రిపూట హనుమాన్ చాలీసా ని ఎనిమిది సార్లు చదివితే కష్టాల నుండి గట్టెక్కొచ్చు అని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
Advertisement
Advertisement
ఏదైనా పనిలో విజయాన్ని సాధించాలని అనుకున్నట్లయితే మంగళవారం, గురువారం, శనివారం లేదంటే మూల నక్షత్రం ఉన్న రోజుల్లో రాత్రి పూట హనుమాన్ చాలీసా ని చదువుకోవడం మంచిది. వీలైతే 108 సార్లు చదువుకోండి. ఇలా హనుమాన్ చాలీసా ని చదివితే కష్టాల నుండి గట్టెక్కచ్చు. ఎలాంటి భయం ఉండదు. ఇబ్బందుల నుండి కూడా బయటికి రావచ్చు. 8 సార్లు హనుమాన్ చాలీసా ని చదివితే పాపాలు పోతాయి. రాత్రులు హనుమాన్ చాలీసా చదివితే దుష్టశక్తులు నీడ మీ మీద నుండి పోతుంది.
Also read: