Advertisement
చాలామంది దేవుడిని ప్రార్థించేటప్పుడు హనుమాన్ చాలీసాని చదువుతారు. హనుమాన్ చాలీసా చదవడం వలన ఉపయోగాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. రామాయణంలో హనుమంతుడు ప్రత్యేకంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు ఆంజనేయుడుతోనే సాధ్యమవుతాయి. లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోతే సంజీవని చెట్టు కావాలంటే వెతికి పట్టుకుని హనుమంతుడు వస్తారు. అలానే సీతాదేవి జాడను తెలుసుకోవడానికి మారుతి చేస్తున్న సహవాసాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బలం, ధైర్యం, ఆత్మవిశ్వాసం కలగాలంటే హనుమంతుని తలుచుకోవాలని పెద్దలు అంటూ ఉంటారు.
Advertisement
ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమాన్ చదవడం వలన అనేక లాభాలు ఉంటాయని పండితులు అంటున్నారు. మరి ఆ లాభాల గురించి ఇప్పుడు చూద్దాం.. చాలా మంది దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు కలియుగంలో కష్టాల్లో ఉన్నవాళ్లు ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ఆయన వెంటనే ఆదుకుంటాడని శ్రీ తులసీదాస్ విరచిత హనుమాన్ చాలీసా ద్వారా చెప్పారు. తులసీదాస్ ఆంజనేయ భక్తుడు. హనుమాన్ చాలీసా ను ఆయన రూపొందించారు. ఈతి బాధలు, గ్రహ దోషాలు, శని గ్రహ దోషాలు, భూత ప్రేతపిశాచ బాధలు వంటివి తొలగిపోతాయి.
Advertisement
Also read:
వీటి నుండి విముక్తి కలగాలంటే హనుమాన్ చాలీసను తప్పక చదువుకోవాలని అన్నారు హనుమాన్ చాలీసను ప్రతిరోజు ఐదు సార్లు చదివితే చాలా మంచిదట. తర్వాత తులసి దళాలపై శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి పటం వద్ద పెట్టాలి. ఇలా 11 రోజులు పాటు చేయడం వలన అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇలా చేస్తే సూచి, శుభ్రత పాటించాలి ముఖాన సింధూరం ధరించాలి. అప్పుడే ఆంజనేయస్వామి అనుగ్రహం కలుగుతుందట ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ధ్యాస ఒకదానిపై ఉండడానికి హనుమాన్ చాలీసా ఎంతగానో ఉపయోగపడుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!