Advertisement
సంక్రాంతి కానుకగా హనుమాన్ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తేజ సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా పెద్ద హిట్ అయింది. హనుమాన్ 2024 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లను ఈ సినిమా రాబట్టింది ఎటువంటి ఇమేజ్ లేని ఒక హీరో ఇంత పెద్ద హిట్ కొట్టడం సాధారణ విషయం కాదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. జనవరి 12న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ టాప్ తో బాక్సాఫీస్ వద్ద హనుమాన్ సినిమా దూసుకు వెళ్ళిపోయింది. హనుమాన్ కి పోటీగా విడుదలైన బడా హీరోలు హనుమాన్ ముందు అస్సలు నిలవలేకపోయారు.
Advertisement
ఈసారి సంక్రాంతి బరిలోకి గుంటూరు కారం, సైన్ధవ్, నా సామిరంగా వంటి సినిమాలు వచ్చాయి అయితే ఈ సినిమాలన్నీ కూడా హనుమాన్ ని బీట్ చేయలేకపోయాయి హనుమాన్ మాత్రం ఓటీటీ లోకి కూడా ఇంకా రాలేదు. సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం నా సామీరంగా సినిమాలో ఓటిటిలోకి వచ్చేసాయి ఇప్పటికీ ఓ మోస్తరు వసూళ్లను రాబడుతోంది. ఇటీవల నైజం లో టికెట్లు ధరలు తగ్గిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు త్వరలోనే ఓటీటీ లోకి వస్తోంది. మార్చి 2 నుండి హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Advertisement
జీ ఫైవ్ హనుమాన్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. సో మార్చి 2 నుండి జీ ఫైవ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. హనుమాన్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తేజ సరసన ఈ అమృత అయ్యర్ ఈ సినిమాలో నటించారు వరలక్ష్మీ శరత్ కుమార్ వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు హనుమాన్ కి సీక్వెల్ ఉందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే 2025లో జయ హనుమాన్ థియేటర్లలోకి రాబోతుందట. హనుమాన్ సినిమాలానే జై హనుమాన్ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. మరి ఆ సినిమా ఎలా ఆకట్టుకుంటుంది అనేది చూడాలంటే కొన్నాళ్ళు వేచి ఉండాల్సిందే.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!