Advertisement
కమర్షియల్ డైరెక్టర్ గా హరీష్ శంకర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈయన రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ తో కమర్షియల్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని క్రమంలో వరుస సినిమాలను చేయాలని ఆయన చూస్తున్నారు.
Advertisement
అందులో భాగంగానే ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ ని హీరోగా పెట్టి ఒక డిఫరెంట్ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయాలని ఆయన అనుకుంటున్నారు. అందుకోసం పవన్ కళ్యాణ్ సినిమాని పక్కన పెట్టి అందాకా వేరే సినిమాలతో బిజీ అవుతున్నారు. మొత్తానికి ప్రస్తుతం హరీష్ శంకర్ తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబల్ ఇస్మార్ట్ అనే సినిమాని రామ్ చేస్తున్నారు.
Advertisement
Also read:
ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకి రాబోతోంది ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన సినిమా చేస్తున్నారని అఫీషియల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ తో సినిమాలు చేస్తూ వస్తున్న హరీష్ శంకర్ తో సినిమా చేయడం వలన ఆయన కెరీర్ కి ప్లస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రామ్ మాస్ మసాలా సినిమాలు చేస్తూ ఉంటారు. హరీష్ శంకర్ కూడా అలాంటి సినిమాలు తో సక్సెస్ ని అందుకుంటుంటారు. సో ఈ కాంబో సెట్ అవుతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!