Advertisement
అన్ని దానాల్లోనూ అన్న దానం గొప్పది అని అంటుంటారు. ఈ నానుడి కనిపెట్టే సమయానికి అవయవ దానం గురించి అప్పట్లో తెలియదు. కానీ, అవయవ దానం దానికంటే గొప్పది. ఎందుకంటే అది ఓ మనిషికి పునర్జన్మని ఇస్తుంది. ఇటీవల చాలా మంది రోడ్డు ప్రమాదాలు, గుండెపోటుతో చనిపోవడాలు చూస్తూనే ఉన్నాం. ఏదో సినిమాలో చెప్పినట్టు యాక్సిడెంట్ అంటే ఓ వ్యక్తి చనిపోవడం మాత్రమే కాదు.. ఓ కుటుంబం రోడ్డున పడడం కూడా. అయితే.. కొంతమంది తమ చావుతో ఇతరులను బ్రతికిస్తూ ఉంటారు. వారి అవయవాలను దానం చేసి మరో నలుగురికి కొత్త జీవితాన్ని ఇస్తారు.
Advertisement
సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన గుండ్ర హరిత కూడా ఇదే కోవలోకి వస్తారు. ఆమె వయసు కేవలం 26 సంవత్సరాలు. కొంతకాలం క్రిందట ఆమెకు యశ్వంత్ ప్రసాద్ రెడ్డి తో వివాహం జరిగింది. యశ్వంత్ ఓ ప్రైవేట్ బ్యాంకు లో అసిస్టెంట్ మెనేజర్ గా పనిచేస్తున్నారు. వీరికి పది నెలల పాప కూడా ఉంది. ఒకరోజు ఇంట్లో ఉన్నట్లుండి హరిత కుప్పకూలి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఐసీయూ లో ఉంచి చికిత్స అందించినా ఆమె కోలుకోలేదు. సికింద్రాబాద్ లోని సన్ షైన్ హాస్పిటల్లో ఆమెకు చికిత్స చేసారు. ఆమె బ్రెయిన్ డెడ్ అయింది అని వైద్యులు తెలిపారు.
Advertisement
ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులను జీవన్ దాన్ ప్రతినిధులు కలిశారు. అవయవ దానం చేస్తే.. మరో నలుగురి జీవితం బాగుంటుందని వివరించడంతో హరిత అవయవాలను దానం చేయడానికి అంగీకారం తెలిపారు. ఆమె శరీరం నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు తీసుకుని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో నలుగురికి అమర్చారు. చనిపోయి కూడా హారిక మరో నలుగురికి జీవితాన్ని ఇచ్చింది.
మరిన్ని..
ట్రోల్స్ పై కిరణ్ అబ్బవరం ఏమంటున్నారో తెలుసా ?
రైలులో పరుసు కొట్టేసిన దొంగ.. కిటికి కి వేలాడదీసిన ప్రయాణికులు..!