Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు ఎంతటి స్టార్ హీరోనో మనందరికీ తెలుసు. అయితే ఆయన బావ సుధీర్ బాబు ఇండస్ట్రీలోకి చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన మొదటి నుండి కూడా రెగ్యులర్ మరియు కమర్షియల్ చిత్రాలు చేయకుండా డిఫరెంట్ కథల సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే తాజాగా యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి హంట్ అనే చిత్రంతో మన ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా బాక్సఫీస్ వద్ద ఊహించని విధంగా నష్టాలను చవిచూసింది.
Advertisement
Also Read; DK మొదటి భార్య, మురళి విజయ్ సతీమణిగా ఎలా మారిందంటే?
పెట్టిన బడ్జెట్ లో కనీసం ఒక 10శాతం కూడా వెనక్కి రాలేదట. మొత్తంగా క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు చూస్తే.. మహేష్ సురపనేని డైరెక్షన్లో వచ్చిన హంట్ మూవీ జనవరి 26న బాక్సాఫీస్ వద్ద 6.20 కోట్ల టార్గెట్ తో థియేటర్లోకి వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.. మొత్తానికి తీవ్రమైన డిజాస్టర్ గా నిలిచింది అని చెప్పవచ్చు.టోటల్ ఇండియాలో చూసుకుంటే ఎక్కడా కూడా పెద్దగా కలెక్షన్స్ వచ్చిన అప్డేట్స్ అయితే కనబడటంలేదు.
Advertisement
ఇక ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ప్రీమీయర్స్ తర్వాత కూడా ఎక్కువ షోలు పడలేదు. మొత్తంగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్ చూస్తే కేవలం 61 లక్షల రాబట్టి నష్టాల పాలయింది.. సుధీర్ బాబు ఇంతకుముందు కూడా కొన్ని డిజాస్టర్స్ అందుకున్నాడు. కానీ హంట్ మూవీ కనీసం కోటి రూపాయల షేర్ కూడా రాబట్ట లేకపోయింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 6.20 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయి, ప్రపంచ వ్యాప్తంగా కేవలం 60 లక్షల షేర్ మాత్రమే రావడంతో సినిమా దాదాపు ఐదున్నర కోట్ల వరకు నష్టాలను కలిగించింది.
Also Read: ఉదయకిరణ్ చనిపోవడానికి వారం ముందు ఆ దర్శకుడితో ఏమని చెప్పాడో తెలుసా ?