Advertisement
తెలుగు రాష్ట్రంలో మొదటిసారి 70mm థియేటర్ ను సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే కట్టించారు. అప్పట్లో మీడియా కూడా ఈ విషయాన్ని హైలెట్ చేయడంతో అందరిలో ఆసక్తి రేకెత్తించింది. కళాత్మక విలువలతో ఎన్టీఆర్ థియేటర్ ను నిర్మించి 1968లో ఈ జంట థియేటర్స్ ను ప్రారంభించారు. ఈ రెండు థియేటర్లకు స్వర్గస్తులైన తన పెద్ద కుమారుడు రామకృష్ణ పేరు పెట్టారు. తన పెద్ద కుమారుడు అకాల మరణం వల్ల ఎన్టీఆర్ ఎంతగానో కుంగిపోయారు. దీంతో తన కొడుకు మృతికి గుర్తుగా ఈ రెండు థియేటర్లను కట్టించి దానికి రామకృష్ణ థియేటర్ అని పేరు పెట్టారు.
Advertisement
ఆ సమయంలో థియేటర్ల కొరత ఎక్కువగా ఉండేది. ఉన్న థియేటర్లలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. ఈ విషయాన్ని గమనించిన ఎన్టీఆర్ అత్యంత అధునాతన సౌకర్యాలతో థియేటర్ ను నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ లో తొలి ఎయిర్ కండిషన్ థియేటర్ రామకృష్ణ 70 MM థియేటర్ కావడం విశేషం.ఈ థియేటర్ లో మొదటి సినిమా ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చిత్రం తో ప్రారంభమైంది. ఎంతో ఘనంగా ఎన్టీఆర్ స్నేహితుడు ఎంజీఆర్ ఈ థియేటర్ ను ప్రారంభించారు. 1975లో షోలే చిత్రం విడుదలైంది. రాష్ట్రం మొత్తం మీద రామకృష్ణ థియేటర్లో మాత్రమే ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాను చూడటానికి జనాలు పోటెత్తారు.
Advertisement
జనాలను అదుపు చేయడానికి పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ జంట థియేటర్లు ఎన్టీఆర్ మరణం తర్వాత వాటి ప్రభావాన్ని కోల్పోయాయి. ఇక తెలుగుదేశం హయాంలో ఈ థియేటర్లలో బూతు చిత్రాలు కూడా ప్రదర్శించడం విషాదకరమైన విషయం. పోలీసు దాడులు ఉండవు కనుక స్వేచ్ఛగా ఆ చిత్రాలను వేసేవారు. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం బయటకు రావడంతో రచ్చ జరిగింది. ఆ తర్వాత కొంతకాలం థియేటర్ ను మూసేశారు. దీని తర్వాత ఇంద్ర సినిమా సంస్థ థియేటర్ ను తీసుకొని మళ్లీ కొత్త హంగులతో ప్రారంభించింది.
ALSO READ;