Advertisement
పూర్వకాలంలో కోటి విద్యలు కూటి కోసమే అనేవారు పెద్దలు.. కానీ ఈ టెక్నాలజీ కాలంలో మాత్రం కోటి విద్యలు కట్టల కొరకే అనే విధంగా మారిపోయారు.. మనుషుల కంటే ఎక్కువగా కాగితాల రూపంలో ఉండే మణికే వ్యాల్యూ ఇస్తున్నారు.. అలాంటి మనీ సంపాదించడం కోసం కొంతమంది చేయరాని పనులు కూడా చేస్తూ సమస్యల పాలవుతున్నారు.. ఈ మనీ అనేది మనిషితో ఏదైనా చేయిస్తుంది అనే సామెతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతూ మనీ మైండెడ్ గా మారుతున్నారు.
Advertisement
ALSO READ:ఆ క్లిష్ట పరిస్థితుల్లో బాహుబలిని..రాజమౌళి ఆపేద్దాం అనుకున్నారా..?
కొంతమందికి ఈ మనీ సంపాదనలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని చివరికి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా అనేకం ఉన్నారు.. ఎంత చెప్పుకున్నా,ఏం చేసినా మనీ మెయిన్ గా ఉంటుందనేది జగమెరిగిన సత్యం.. మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం మొదలు మళ్లీ ఇంట్లోకి వచ్చే వరకు ఎక్కడో ఓ దగ్గర మనీ తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. అందుకనే చాలామంది బయటకు వెళ్లేటప్పుడు జేబులో తప్పనిసరిగా డబ్బును తీసుకెళ్తారు.. ఇలా డబ్బు చుట్టూ తిరిగే మనం ఆ నోట్లపై ఉండే డిజైన్లను మాత్రం ఇప్పటివరకు గమనించలేదు.
Advertisement
కానీ వాటికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయట.. అందులో ఒక డిజైన్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. కరెన్సీ నోటు పైన ఎడమ మరియు కుడి వైపు సన్నని గీతలు ఉంటాయి. ఆ గీతలు ఎందుకు పెట్టారు అనేది మనలో చాలా మందికి తెలియదు. దీనికి ప్రధాన కారణం కొంతమంది అంద వ్యక్తులు నోటును పట్టుకున్నప్పుడు ఆ గీతలను బట్టి వారు అది ఎంత నోట్ అనేది గుర్తిస్తారట.. ఇందులో 2000 నోట్ పై 7 గీతలు, 500 నోట్ పై ఐదు గీతలు ఉంటాయి. మీరు ఇప్పుడే గమనించండి.
ALSO READ:హీరో వెంకటేష్-సౌందర్య కాంబోలో వచ్చిన సినిమాల్లో ఎన్ని హిట్ కొట్టాయో తెలుసా..?