Advertisement
వీరప్పన్ ఇండియా మొత్తంలో పేరుగాంచిన స్మగ్లర్.. గంధపుచెక్కల వ్యాపారంలో తమిళనాడు ,కేరళ, కన్నడ పోలీసులకు చెమటలు పట్టించిన వ్యక్తి.. అలాంటి పేరుమోసిన స్మగ్లర్ కడుపున పుట్టిన కూతురు అంటే అందరికీ చిన్నచూపే. కానీ ఆమె మాత్రం సమాజం కోసం ఒక్క అడుగు ముందుకు వేసి ప్రజాసేవ కోసం పూనుకొంది.. మరి ఆ వివరాలు ఏంటి అనేది పూర్తిగా చూద్దాం.. వీరప్పన్ కూతురు పేరు విద్యా రాణి.. ఈమెకు పేరు పెట్టింది కూడా ఒక పోలీస్ ఆఫీసర్..
Advertisement
also read: ‘ఆచార్య’ అట్టర్ ఫ్లాఫ్.. చిరంజీవి, రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం
వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ప్రెగ్నెంట్ తో ఉన్న సమయంలో పోలీసులకు లొంగిపోయింది.. ఈ క్రమంలోనే ఆమె కు కూతురు పుట్టింది.. అక్కడి పోలీస్ ఆఫీసర్ ఆమెకు విద్యా రాణి అని పేరు పెట్టారు. అయితే తన కూతురు డాక్టర్ కావాలన్నదే వీరప్పన్ కల.. తన చిన్ననాటి నుంచి తన తండ్రిని చూడని విద్యా రాణి ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆరుబయట ఆడుకునే సమయంలో సడన్ గా వచ్చిన వీరప్పన్ తన కూతుర్ని దగ్గరకు తీసుకొని ఒక మాట చెప్పారట.. బాగా చదువుకొని పేద ప్రజలను కాపాడాలని అన్నారట.. వీరప్పన్ కూతురు తండ్రిని చూడడం అదే మొదటిసారి మరియు చివరి సారి..
Advertisement
కానీ విద్యా రాణికి సివిల్స్ ఎంపిక కావాలనేది టార్గెట్.. ఎం.బి.బి.ఎస్ లో సీటు వచ్చినా డిగ్రీ లో చేరింది.. చివరికి లా పూర్తి చేసింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఆమె ఫ్రీ స్కూల్ పెట్టి వన్నీయర్ అనే వెనుకబడిన తెగ కోసం నడిపిస్తోంది. ఈమె 2011లో తనకు నచ్చిన వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ప్రస్తుతం బీజేపీ పార్టీలో చేరి ఆరు నెలల్లోనే తమిళనాడు రాష్ట్ర యువ మోర్చా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియామకమైంది..
also read: