Advertisement
హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల మీద జిహెచ్ఎంసి అధికారులు కొన్ని రోజులుగా సీరియస్ గా వున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఇళ్ళను కూలుస్తున్నారు ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇల్లు లోటస్ పాండ్ ముందు ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. జిహెచ్ఎంసి అధికారులు జగన్ ఇంటి ముందు ఉన్న నిర్మాణాలు కూల్చివేయడంపై జిహెచ్ఎంసి ఇంచార్జి కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయ్యారు.
Advertisement
ఇంటి యజమాని పొరుగు రాష్ట్రం మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డికి ఏ సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మంత్రి ఆదేశాలతోనే కూల్చివేతలు జరిగినట్లు ఇప్పటికే సమాచారం. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై ఇన్చార్జి కమిషనర్ చర్యలకు ఉపక్రమించారు. అయితే బాధ్యతల నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిఐడి కి రిపోర్ట్ చేయాలని సూచించారు.
Advertisement
Also read;
Also read:
ఫుట్ పాత్ ను ఆక్రమించి ఇంటి ముందు సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు జిహెచ్ఎంసి అధికారులకు కంప్లైంట్ చూసారు. పోలీసులు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన జిహెచ్ఎంసి అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు అయితే ఈ కూల్చివేతకు కారణం ఒక మంత్రిని.. ఆ మంత్రి తెలంగాణకు చెందిన ఆయన లేదంటే ఆంధ్ర కి చెందిన ఆయన అనేది తెలీదు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడం అలాగే మంత్రి తొలగించాలని ఆదేశించడంతో జిహెచ్ఎంసి అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!