Advertisement
దేశంలో అనేక ప్రయోజనకర సంక్షేమ పథకాలు ఉన్నాయి. కొంతమంది ప్రజలు వీలైనంతవరకు వీటిని పొందేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ ఓ వ్యక్తి ఓ పథకం నుండి కొంత డబ్బును పొందేందుకు చేసిన ఈ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ కు చెందిన ఈ వ్యక్తి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా వివాహాలను నిర్వహించే ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన పథకం నుండి డబ్బులు పొందేందుకు సామూహిక వివాహ కార్యక్రమంలో ఏకంగా తన సొంత సోదరిని వివాహం చేసుకున్నాడు.
Advertisement
Read also: త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా అడ్వాన్స్ తో ఏం చేశారో తెలుసా ?
Advertisement
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ తుండ్ల ప్రాంతంలో 51 సామూహిక వివాహాలు జరిగాయి. ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన స్కీం కింద ఇలా వివాహం చేసుకున్న పెళ్లికూతురు అకౌంట్లో మొత్తం 35వేల రూపాయల వరకు ప్రోత్సాహకంగా ఇస్తారు. అందులో పెళ్లికూతురు అకౌంట్లో 20 వేల రూపాయలు, 10 వేల రూపాయల విలువైన ఇంటి సామాగ్రి, 5 వేల విలువ గల పెళ్లి సామాన్లను అందిస్తారు. ఆ డబ్బుల కోసం ఆశపడి తుండ్లా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వేరే ఆధార్ కార్డుతో తన సొంత చెల్లిని వివాహం చేసుకొని ఆ స్కీం కింద లబ్ధి పొందాడు. ఈ పెళ్లిని తోటి గ్రామస్తులు అన్న, చెల్లెలుగా గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. పేదరికం, చేతగానితనం ఈ స్థాయికి వెళ్లేలా చేసిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిపై కేసు నమోదు అయింది. ఈ విషయం గురించి తెలియడంతో పథకం కింద ఆ జంటకి అందించిన ఇంటి సామాగ్రిని కూడా తీసుకెళ్లారు.
Read also: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ కొత్త సినిమాలు ఇవే..