Advertisement
పాలను ఒక ఆహారంగా భావిస్తారు. ఎందుకంటే పాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కావున పాలు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే చాలామంది ఆరోగ్య నిపుణులు మంచి ఆరోగ్యం కోసం వీటిని తాగాలని సూచిస్తారు. పాలను వివిధ రకాల వంటకాలలో కూడా ఉపయోగిస్తారు. కొంతమంది శరీర దృఢత్వం కోసం నేరుగా వాటిని తాగుతారు. లేదా పాలతో తయారు చేసిన ఉత్పత్తులను తింటారు. అయితే చాలామంది పెద్దలు పచ్చిపాలను తాగడం మంచికాదని చెబుతున్నారు. పచ్చిపాలను తాగడం వల్ల శరీరానికి ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకుందాం.
Advertisement
Advertisement
పచ్చిపాలు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనేది నిజమేనని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికాస్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం, పచ్చిపాలలో ఎస్చేరీచియ కోలా, లిస్టేరియా, సాల్మోనెల్ల మొదలైన అనేక హానికరమైన బ్యాక్టీరియా ఉంటాయని, ఇవి శరీరానికి హాని కలిగిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పచ్చిపాలలో ఉండే బ్యాక్టీరియా వీరేచనాలు, కీళ్ల నొప్పులు, డిహైడ్రేషన్ వంటి సమస్యలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పశువుల నుంచి నేరుగా పాలను తీసినప్పుడు పొదుగులో కొన్ని రకాల కలుషిత పదార్థాలు పాలలో కలుస్తాయని, వీటిని నేరుగా తాగడం ద్వారా శరీరానికి హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందుకే పాలను మరిగించిన తరువాతే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేష్ బాబు చెల్లెలు !