Advertisement
ప్రేమలో ప్రతి ఒక్కరు గెలవాలనుకుంటారు. కానీ అందరూ సక్సెస్ కాలేరు. కొంతమంది ప్రేమలో విఫలమవుతారు అయితే ఈ రాశుల వాళ్ళు మాత్రమే కచ్చితంగా ప్రేమలో విఫలం అయిపోతారట. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొందరు తమ మొదటి రిలేషన్ షిప్ లో విడిపోవడానికి అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ రాశుల వాళ్ల గురించి చూద్దాం. మేషరాశి వారిలో ఆవేశం అమితమైన స్వేచ్ఛ వంటి లక్షణాలు ఉంటాయి. పరిస్థితుల్ని గమనించకుండా రిలేషన్షిప్ లో వారు ప్రవర్తించే తీరు వలన హార్ట్ బ్రేక్ అవ్వచ్చు. ధనస్సు రాశి వాళ్ళకి కూడా ప్రేమలో విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఉత్సాహంగా ఆశావాద దృక్పథంతో ఉంటారు జీవితంలో సాహసాలు చేయాలని అనుకుంటారు.
Advertisement
కొన్నిసార్లు ఇది బ్రేకప్ కి దారి తీస్తుందట. ఇలా ఈ రాశి వాళ్లు కూడా వాళ్ళ జీవిత భాగస్వామిని పొందడంలో విఫలమవుతారు. అలాగే తులా రాశి వారు ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. అది తమకు నచ్చినట్లే జరుగుతుందని అనుకుంటారు. రొమాంటిక్ రిలేషన్షిప్ లోని ఇబ్బందితో వ్యవహరించడం తులా రాశి వాళ్లకు కష్టంగా ఉంటుంది. దీంతో భాగస్వామితో గొడవలు రావడం హార్ట్ బ్రేక్ అవ్వడం వంటివి కలిగే అవకాశం ఉంటుంది.
Advertisement
Also read:
Also read:
అలాగే దయ, కరుణ వంటి లక్షణాలు ఉండే కర్కాటక రాశి వాళ్ళు మృదుస్వభావులు. ప్రతి విషయంలో రక్షణాత్మక ధోరణి తో అవలంబిస్తూ ఉంటారు. భాగస్వామితో లోతైన అనుబంధం స్థిరత్వానికి ప్రాధాన్యతను ఇస్తారు. ఈ రాశి వాళ్ళకి కూడా రిలేషన్షిప్ లో నష్టం తప్పదట. అలాగే క్రియేటివిటీ తో ఆలోచించే వాళ్ళు మీన రాశి వాళ్ళు రిలేషన్ షిప్ లో సానుభూతి ప్రదర్శిస్తూ ఉంటారు. పార్టనర్ పట్ల అమితమైన అభిమానాన్ని చూపిస్తారు. అయితే వారి భాగస్వామి భావోద్వేగాలు సమస్యలు చిక్కుకుని విలవిల్లాడే అవకాశం లేకపోలేదు. మీన రాశి వాళ్లు కూడా ప్రేమ విషయంలో ఇబ్బందులు పడతారని జ్యోతిష్య నిబంధనలు అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!