Advertisement
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమకు మంచి గుర్తింపు ఉంది. అమ్మ, అక్క, వదిన ఇలా ఏ పాత్రలో అయినా సరే ఆమె ఒదిగిపోయి నటిస్తుంది. హాస్యం కూడా పండించగలగడం ఆమె ప్రత్యేకత. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటివరకు 500 పైగా సినిమాలలో నటించింది హేమ. 1975లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజోలులో జన్మించింది హేమ. 1989లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భలే దొంగ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. అయితే హేమ భర్త ఎవరు? అతనికి బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హేమ భర్త ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. అతని పేరు సయ్యద్ జాన్ అహ్మద్.
Advertisement
Read also: సుకుమార్ గారు మీ ప్లానింగ్ మాములుగా లేదు ! ఇలా ట్విస్ట్ ఇవ్వబోతున్నారా ?
Advertisement
ఈయన సినీ పరిశ్రమలో కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. సయ్యద్ జాన్ అహ్మద్ ను హేమ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. ఓ ఇంటర్వ్యూలో హేమ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. తాను దూరదర్శన్ లో పనిచేస్తున్న సమయంలో జాన్ తో ప్రేమలో పడ్డాను అని పేర్కొంది. ఓసారి తను ఎగ్జిబిషన్ కి వెళుతుండగా జాన్ కూడా వచ్చారని.. మొదటిసారి కలిసినప్పుడే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారని తెలిపింది. ప్రేమ అంటూ మాటలు చెప్పకుండా నేరుగా అలా అడగడం తనకు నచ్చిందని, అందుకే అతడిని పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది.
ఆ సమయంలో ఇంట్లో వాళ్లకి చెప్పకుండానే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని తెలిపింది. ఆ తర్వాత ఇంట్లో తెలిసి మా అమ్మ సీరియస్ అయిందని, తనకి 18 ఏళ్ళ వయసులోనే పెళ్లి జరిగిందని వెల్లడించింది. ఇక ప్రస్తుతం హేమ సినిమాలకు దూరంగా ఉంటుంది. దీనికి కారణాలను కూడా వెల్లడించింది హేమ. ఈ మధ్య కొత్త బిజినెస్ ప్రారంభించానని, అందులో మంచి లాభాలు ఉన్నాయని తెలిపింది. అయితే తన బిజినెస్ ఏమిటన్న వివరాలను వెల్లడించలేదు కానీ.. అందుకే నటనకు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది.
Read also: NTR గారికి హీరోయిన్ గా, మానవరాలిగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ?