Advertisement
నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు డైలాగ్ కింగ్ సాయికుమార్. నటించడం మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా పలు చిత్రాలను తెరకెక్కించారు. ఇక డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు ఆది. ఆయనకి ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ మధ్యకాలంలో కధ, కథనం విషయంలో కొన్ని పొరపాట్ల వల్ల ఆది సాయికుమార్ కి సరైన విజయం దక్కడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది సాయికుమార్, ఆయన భార్య అరుణ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
Advertisement
Read also: ఆరుగురు పతివ్రతలు సినిమాలో నటించిన ఈ బ్యూటీ…ఇప్పుడేం చేస్తుందో తెలుసా…
Advertisement
ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. “అరుణ ని మొదటిసారి మా సిస్టర్ పెళ్లిలో చూశాను. ఆ పెళ్ళికి అరుణ వాళ్ళు వచ్చారు. మా సిస్టర్ వాళ్ళ మామయ్యకి, అరుణ వాళ్ళ నాన్న ఫ్రెండ్. ఆయనే మా మామయ్యని పరిచయం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మా బావ ఫోన్ చేసి ఇలా అరుణ వాళ్ళు పెళ్లి ప్రపోజల్ పెట్టారని చెప్పారు. నాకు కాస్త సమయం కావాలని అడిగాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఫోటోలు చూసి ఓకే చేశాను” అని తెలిపారు ఆది. ఇక ఆది భార్య అరుణ మాట్లాడుతూ.. “ఆదితో పెళ్లి అని చెప్పిన సమయంలో గూగుల్ లో సెర్చ్ చేసి ఆయన గురించి తెలుసుకున్నాను. మా పెళ్లి చూపులు ఎయిర్ పోర్టులో జరిగాయి. మా మామయ్య సాయికుమార్ గారు ఏదో ఊరు వెళుతున్నారు. అనుకోకుండా మా పేరెంట్స్ కూడా అదే సమయానికి హైదరాబాద్ వచ్చారు.
అప్పుడు ఫోన్ చేసి ఎయిర్ పోర్ట్ కి రా అన్నారు. నేను వెళ్లేసరికి వాళ్లంతా నాకోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లిచూపులు అయ్యాక ఆది నా ఫోన్ నెంబర్ అడిగితే మా నాన్నను అడిగి ఇచ్చాను” అని తెలిపారు. ఆదిని మొదటిసారి కలిసినప్పుడే తనతో నేను కలిసి ఉండగలననే నమ్మకం కలిగిందన్నారు. అందుకే అదే రోజు ఓకే చెప్పేశానని తెలిపారు అరుణ. అంతేకాదు వాళ్ళిద్దరూ హనీమూన్ లో ఓసారి గొడవ పడ్డట్లు తెలిపారు. అది చిన్న గొడవేనని.. మళ్లీ గంటకే మాట్లాడుకుందామని తెలిపారు. అయితే ఆది బహుమతులు ఇచ్చే రకం కాదని.. కొంచెం బద్ధకస్తుడని షాపింగ్ కామెంట్స్ చేశారు. తాను మాత్రం ఆదికి చాలా బహుమతులు ఇచ్చానని.. కానీ ఆది ఆ బహుమతులను పోగొట్టాడని తెలిపారు.
Read also: RAMA BANAM MOVIE HEROINE NAME, AGE, MOVIES, BIOGRAPHY