Advertisement
విడాకులు తీసుకోవడం అనేది సెలబ్రిటీల విషయంలో చాలా కామన్ గా వినిపించే వార్త. బాలీవుడ్ హీరోలతో మొదలుపెడితే చోటామోటా సెలబ్రిటీలు కూడా విడాకులతో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. హాలీవుడ్, టాలీవుడ్, క్రికెటర్లు ఇలా ఇతర రంగాలలో పేరు ప్రఖ్యాతలు పొందే వాళ్ళ విడాకుల వ్యవహారాలు కూడా తరచు వార్తలలో నిలుస్తూనే ఉంటాయి. ఇలాంటి వార్తలు సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా త్వరగా వైరల్ అవుతున్నాయి. అయితే ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో తప్పులేదు కానీ ఈమధ్య అసలు వార్తల కంటే పుకార్లే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇలా గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సీనియర్ జంట శ్రీకాంత్ – ఊహ విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
Advertisement
Read also: ఎన్టీఆర్ ఇంటి నుండి కార్స్, బైక్స్ వరకు ఒకొక్కదాని రేటెంతంటే!
శ్రీకాంత్ – ఊహల ఫ్యామిలీ ఆర్థికపరమైన ఇబ్బందులలో ఉందని, వారిద్దరి మధ్య ఇంట్లో కోల్డ్ వార్ జరుగుతోందని, ఇక వారు విడిపోతారనే వార్త వైరల్ గా మారింది. ఈ వార్తలపై హీరో శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ పుకార్లను తీవ్ర స్థాయిలో ఖండిస్తూ శ్రీకాంత్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ” ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను..!? గతంలో నేను చనిపోయినట్లుగా ఓ పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా వీడాకులు తీసుకుంటున్నాం అంటూ ఓ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని వెబ్సైట్స్ లో వచ్చిన ఈ అసత్య వార్తలను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తన కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. ఇలాంటివి ఏమాత్రం నమ్మొద్దు.. ఆందోళన పడవద్దు.. అని ఊహను నేను ఓదార్చాను.
Advertisement
కొన్ని చిల్లర వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో బంధుమిత్రులు అందరూ ఫోన్ చేసి వివరాలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక పెద్ద న్యూసెన్స్ అనిపిస్తుంది. ప్రస్తుతం ఊహ నేను నిన్న చెన్నై నుంచి వచ్చి ఇక్కడ నుండి దైవదర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇది ఇంకా వైరల్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. ఇలా నా మీదే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్ ల మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా ” అంటూ శ్రీకాంత్ ఆ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.
Also Read: మళ్ళీ ఇప్పటం పయనం.. పవన్ అరెస్ట్ తప్పదా ?