Advertisement
బాలకృష్ణ హీరోగా వచ్చిన సమరసింహారెడ్డి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా చాలా ప్రత్యేకం, బాలకృష్ణ 1997లో పెద్దన్నయ్య సినిమా చేశారు ఆ సినిమా విజయం తర్వాత వచ్చిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ ని అందుకో లేకపోయే. 1999 లో రిలీజ్ అయిన సమరసింహారెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులని తిరగ రాసింది. ఈ సినిమాకి బి గోపాల్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతాన్ని అందించారు.
Advertisement
ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. బాలకృష్ణ కెరియర్ లో సమరసింహారెడ్డి పెద్ద హిట్ అయింది. బి.గోపాల్ మొదట ఈ కథని బాలకృష్ణకి చెప్పలేదట ఇంకో హీరోకి కథని చెప్పారు కానీ ఆ సినిమా చేయడానికి ఆ హీరో ఒప్పుకోకపోవడంతో బాలకృష్ణ వరకు ఈ కథ వచ్చింది. ఆ సినిమాని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో కాదు వెంకటేష్. అయితే ఈ కథ వెంకటేష్ కి నచ్చింది కానీ ఫ్యాక్షన్ కథలు తనకి సెట్ అవ్వవు అని రిజెక్ట్ చేశారు వెంకటేష్.
Advertisement
బాలకృష్ణ వంటి మాస్ హీరో ఈ కథకి న్యాయం చేయగలరని కూడా వెంకటేష్ చెప్పారట ఇలా బాలకృష్ణ వరకు ఈ సినిమా రావడం, సినిమా చేయడం జరిగాయి. వెంకటేష్ అన్నట్టు బాలకృష్ణకి ఈ సినిమా బాగా సెట్ అయింది. సమరసింహారెడ్డి పాత్రకి జీవం పోసేసారు బాలయ్య కానీ వెంకటేష్ సినిమా చేసి ఉంటే వెంకటేష్ కి హిట్టు వచ్చేది. కానీ అప్పట్లో ఫ్యామిలీ స్టోరీస్ తో వెంకటేష్ బిజీగా ఉండేవారు. కలిసుందాం రా, సూర్యవంశం, రాజా వంటి సాఫ్ట్ కథలను ఎంపిక చేసుకునే వారు అటువంటి సమయంలో ఫ్యాక్షని సినిమా అంటే కష్టమే.
Also read: