Advertisement
కొంతమంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. నిజానికి టాలెంట్ ఉన్నా లేకపోయినా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అయిపోవచ్చు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే అని చాలామంది భావిస్తారు. కానీ అది నిజం కాదు. కచ్చితంగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ట్యాలెంట్, లక్ రెండు ఉండాలి. అప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో రాణించడానికి అవుతుంది. ఈరోజుల్లో చాలా మంది టాలెంట్ ని నమ్ముకుని ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అలా సక్సెస్ అయిన హీరోలు చాలామంది ఉన్నారు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఫెయిల్ అయిన హీరోల వివరాలను చూద్దాం.
Advertisement
ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉండి కూడా నాగబాబు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేకపోయారు. నాగబాబు చేసిన సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. ఈ కారణంగానే కొన్ని రోజులకే నాగబాబు ఫేడ్ అవుట్ అయిపోయారు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు గుర్తింపుని తెచ్చుకున్నారు. అయినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు నాగబాబు. అసలు ఆయనకి హీరోగా చేయాలని ఆసక్తి కూడా లేదు ఏదో చిరంజీవి చెప్పిన దానిని పట్టుకుని ఇండస్ట్రీ లోకి వచ్చారు కానీ ఆయనకి ఇండస్ట్రీలో పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అలానే తారకరత్న కూడా ఫేడ్ అవుట్ అయిపోయారు.
Advertisement
తారకరత్న ఇండస్ట్రీకి రాగానే 9 సినిమాలను అనౌన్స్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు తారకరత్న. ఒకటో నెంబర్ కుర్రోడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. దాంతో తర్వాత ఆయన చేసిన సినిమాలు కూడా వరుసగా ప్లాప్ అవడంతో ఇండస్ట్రీకి దూరమైపోయారు. స్క్రిప్ట్ సెలక్షన్ లో చేసిన తప్పులు వలన తారకరత్న ఫెయిల్ అయ్యారు. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలు భారీ యాక్షన్ సినిమాలు చూస్తున్నారు కాబట్టి తాను కూడా అలాంటి సినిమాలు చేయాలని ముందుకు సాగారు. కానీ పెద్దగా కలిసి రాలేదు ఇలా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఈ హీరోలు ఫెయిల్ అయ్యారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!