Advertisement
మంచి సినిమా చేయాలని, హిట్ అందుకోవాలని, భారీ కలెక్షన్లు రాబట్టాలని ప్రతి హీరో కూడా అనుకుంటారు, అయితే సినిమాల్లో సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా కథ బాగుండాలి. సినిమా హిట్ అవ్వాలంటే, హీరోలు మంచి కథని ఎంపిక చేసుకోవాలి. అప్పుడప్పుడు హీరోలు డబల్ రోల్ ఉన్న సినిమాలను కూడా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అలా డబల్ రోల్ చేసి సక్సెస్ ని అందుకున్న హీరోల గురించి చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాలో డబల్ రోల్ చేశారు. అయినా కూడా ఈ సినిమా డిజాస్టర్ అయింది.
Advertisement
అదుర్స్ సినిమాలో కూడా ద్విపాత్రాభినయం చేశారు ఎన్టీఆర్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. శక్తి సినిమాలో కూడా డబల్ రోల్ చేశారు కానీ అది డిజాస్టర్ అయింది. జై లవకుశ సినిమాలో ట్రిపుల్ రోల్ చేశారు. సినిమా సక్సెస్ అయ్యింది. నాలుగు సినిమాలను ఇలా ఎన్టీఆర్ చేయగా రెండు హిట్లు రెండు ప్లాప్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది.
Advertisement
తర్వాత మళ్ళీ అటువంటి రోల్ ని ఎంపిక చేసుకోలేదు. రవితేజ విక్రమార్కుడు సినిమాలో డబల్ రోల్ చేసి విజయాన్ని అందుకున్నారు. రామ్ చరణ్ మగధీరలో ద్విపాత్రాభినయం చేసి మంచి హిట్ కొట్టారు. నాయక్ లో కూడా ద్విపాత్రాభినయం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రభాస్ బిల్లా సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. బాహుబలి సినిమాలో ద్విపాత్రాభినయం చేసి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలానే మంచి హిట్ ని కూడా కొట్టేశారు ప్రభాస్.
Also read: