Advertisement
కొత్త బంగారులోకం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్ లుగా ఈ సినిమాలో కనపడ్డారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయసుధ కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసింది ఈ మూవీ. ఈ సినిమా కథ, సాంగ్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.
Advertisement
కాలేజీ హాస్టల్ నేపథ్యంలో ఈ సినిమాలో సీన్స్ ఉంటాయి. వీటన్నింటిని చూసి కుర్ర కారు అయితే ఫిదా అయిపోయింది. శ్వేతా బసు ప్రసాద్ ఈ సినిమాతో బాగా అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో వరుణ్ సందేశ్ క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. కానీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. ఈ సినిమా రిలీజ్ 15 ఏళ్లు పూర్తయిపోయింది.
Advertisement
ఈ సినిమాలో మొదట హీరోగా వరుణ్ సందేశ్ ని అనుకోలేదు శ్రీకాంత్ అడ్డాల ముందు అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్య ని హీరోగా పెట్టి సినిమా తీయాలని అనుకున్నారు కథ విన్న నాగార్జున యాక్షన్ నేపథ్యము ఉంటే బాగుందని చెప్పారట. తర్వాత రామ్ పోతినేని దగ్గరికి ఈ స్టోరీ వెళ్ళింది. స్టూడెంట్ రోల్ కావడంతో సెట్ అవ్వదు అని రామ్ ఒప్పుకోలేదు అదే సమయంలో ఇంకో హీరో కోసం వెతుకుతుంటే హ్యాపీడేస్ సినిమాతో పాపులర్ అయిన వరుణ్ సందేశ్ బాగున్నాడని అనుకున్నారు ఇలా ఫైనల్ గా వరుణ్ సందేశ్ చేతికి సినిమా వచ్చింది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!