Advertisement
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటించిన మెప్పించింది. మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ హనీ రోజ్. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే.
Advertisement
కాగా సీనియర్ బాలకృష్ణకు హనీ రోజ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కంటే ముందు హనీ రోజ్ మలయాళంలో చాలా సినిమాలు చేసింది. కాగా దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి లో నటించే అవకాశం కల్పించారు. ఈ సినిమా తర్వాత హనీ రోజ్ పేరు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది. దాంతో అసలు హనీ రోజ్ ఎవరు, ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అని తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా హానీ కేరళలో క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. హనీ రోజ్ తండి పేరు తామస్ కాగా తల్లి పేరు రోజ్, చిన్న వయసులోనే హనీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 15 ఏళ్ల వయసులోనే బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ 2008లోనే టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. శివాజీ రాజా హీరోగా నటించిన ఆలయం సినిమాలో నటించింది.
Advertisement
అయితే ఈ సినిమా హిట్ అవ్వలేదు. అంతేకాకుండా మళ్ళీ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ వర్షం సాక్షిగా సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసింది. ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు. దాంతో హనీ రోజ్ కు అవకాశాలు కూడా రాలేదు. అయితే మలయాళంలో మమ్ముట్టి మోహన్ లాల్ లాంటి స్టార్స్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన తర్వాత హని రోజ్ కెరీర్ మలుపు తిరిగింది. ఇక ఇప్పుడు బాలయ్యకు జోడిగా వీరసింహారెడ్డి సినిమాలో మెరిసింది. అంతేకాకుండా క్రేజ్ కూడా సంపాదించుకుంది.
READ ALSO : ‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు