Advertisement
సెలబ్రిటీల పెళ్లిళ్ల గురించి అనేక గాసిప్స్ వస్తూ ఉంటాయి. కొన్ని నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు మాత్రం అవి నిజం అవ్వవు. మెగా ఫ్యామిలీ గురించి చూస్తే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, అల్లు శిరీష్ ఇంకా బ్యాచిలర్స్ గా ఉన్నారు. వైష్ణవ తేజ్ గురించి ఆ మధ్య రూమర్స్ కూడా వచ్చాయి. వైష్ణవ ఒక క్రేజీ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పైగా హీరోయిన్ గురించి రూమర్స్ రావడం కూడా అదే మొదటిసారి. ఆమె సైలెంట్ గా మెగా ఫ్యామిలీలో కలిసిపోయిందని ప్రచారం జరుగుతోంది.
Advertisement
ఆమె ఎవరో కాదు రీతూ వర్మ. స్టైలిష్ గా అందంగా కనబడుతూ ప్రేక్షకులు హృదయాలని గెలుచుకుంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి అయినప్పుడు కుటుంబ సభ్యులు మాత్రమే పెళ్ళిలో ఉన్నారు. రిసెప్షన్ కి టాలీవుడ్ ప్రముఖులు వచ్చారు. లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లిలో రీతూ వర్మ కూడా కనబడింది. మెగా ఫ్యామిలీ ఫొటోస్ లో కూడా ఆమె కనిపించింది.
Advertisement
Also read:
దీంతో అప్పటినుంచి కూడా రూమర్స్ వచ్చాయి. వైష్ణవ తేజ్ రీతు వర్మ డేటింగ్ లో ఉన్నారని చాలామంది అనుకుంటున్నారు. దీనిపై వైష్ణవ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. రీతు లావణ్య కి బెస్ట్ ఫ్రెండ్ అందుకనే ఆమె పెళ్లికి వచ్చిందని అన్నారు. మెగా ఫ్యామిలీలో కలిసిపోయి ఆమె హంగామా చేయడంతో ఏదో ఉంది అని అంతా అనుకుంటున్నారు. రీతు వర్మ ఇప్పటివరకు ఏ మెగా హీరోతో కూడా సినిమా చేయలేదు. ఆమె శ్రీ విష్ణు సరసన స్వాగ్ సినిమాలో చివరగా కనబడింది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి