Advertisement
Anasuya Bharadwaj: అగ్ర హీరోల సినిమాలలో కొన్ని కీలక పాత్రల్లో నటించడానికి కొంతమంది నటీనటులకు మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్లు ఆ అవకాశాన్ని చేజార్చుకుంటారు. ఇక ఒకప్పటి హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాలతో రీయంట్రి ఇవ్వడం ఈమధ్య తరచూ చూస్తూనే ఉన్నాం. వారిని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ రోల్స్ డిజైన్ చేసుకుంటున్నారు దర్శకులు. ఆ హీరోయిన్లు చేస్తేనే ఆ పాత్రకు అందం అని భావిస్తూ ఉంటారు. కానీ కొందరు నటీమణులు ఒక్కోసారి ఆయా పాత్రలను మిస్ చేసుకున్న పాత్రలు వేరే వాళ్లకు మంచి సక్సెస్ ని అందించిన సందర్భాలు కోకోల్లలు.
Advertisement
Read also: వివాహం జరిగే సమయంలో వధువరులు తెల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తారు?
ఇలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఓ స్టార్ హీరో సినిమాలో మంచి పాత్రను మిస్ చేసుకుంది. అలా మిస్ చేసుకున్న సినిమా ఏంటంటే.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. విలేజ్ పొలిటికల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో రంగమ్మ పాత్ర కూడా ఒకటి. ఈ పాత్రలో అనసూయ నటించి మెప్పించింది. ఈ పాత్రతో అనసూయకు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.
Advertisement
అయితే రంగమ్మత్త క్యారెక్టర్ కోసం ముందుగా అనసూయ ప్లేస్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన రాశిని ముందుగా రంగమ్మత్త పాత్ర కోసం సంప్రదించారట సుకుమార్. అయితే ఆ పాత్ర వస్త్రాలంకరణ నచ్చక ఆమె నో చెప్పిందని టాక్. ఆ పాత్రలో మోకాళ్ల వరకు చీర కట్టుకోవాలని కారణంతో ఆ క్యారెక్టర్ కి నో చెప్పిందట రాశి. అంతేకాకుండా మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో గోపీచంద్ లవర్ గా చేసిన నెగిటివ్ క్యారెక్టర్ కూడా తనకు ఇష్టం లేదని.. కానీ పరిస్థితుల ప్రభావం వల్లే చేశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది రాశి.