Advertisement
అనారోగ్యాలు రావడం చాలా కామన్. సాధారణంగా మనుషులు అన్నాక అనేక జబ్బులతో ఇబ్బంది పడటం పెద్ద విషయమేమీ కాదు. కొన్ని మందులతో నయం అయ్యే వ్యాధులు అయితే మరికొన్ని మందులు వాడిన జీవితాంతం వెంటాడే సమస్యలు ఉంటాయి. అయితే ఇటీవల సమంతా తాను మయోసైటీస్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్నాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే సమంత సహా అరుదైన వ్యాధులతో బాధపడుతున్న హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఇలియానా
దేవదాస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఇలియానా తన సన్నటి నడుముతో అందరినీ ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంది.
ఒకానొక సమయంలో ఆమె తనకు డిస్ మార్పిక్ బాడీ డిజార్డర్ ఉందని స్వయంగా తెలిపింది. ఇది ఒక మానసిక వ్యాధి. దీనికి చికిత్స అంటూ ప్రత్యేకంగా ఉండదు. కానీ డాక్టర్ల సూచనతో దీని నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.
అనుష్క శర్మ
Advertisement
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అయిన అనుష్క శర్మ యంగ్జైటీతో పోరాడుతున్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
సోనం కపూర్
అనిల్ కపూర్ తనయ సోనం కపూర్ అతి తక్కువ కాలంలోనే సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే సోనం కపూర్ డయాబెటిస్ తో బాధపడుతుందని ఓ సందర్భంలో ఓపెన్ గా చెప్పేసింది.
నయనతార
తనకు స్కిన్ ఎలర్జీ వచ్చినట్లు నయనతార ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మేకప్ చేసుకుంటున్నట్టు ఆమె తెలిపింది. అలాగే చాలా జాగ్రత్తలు పాటిస్తుంది. ఎప్పుడైనా గాని ఆమె కూల్ ఐటమ్స్ తిన్న వెంటనే ఆమె స్కిన్ టోన్ మారిపోతుందట. స్కిన్ పై రాసేస్ రావడం అలా జరుగుతుందట. దీన్ని అధిగమించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటుంది నయనతార.
పరిణీతి చోప్రా
పరిణీతి చోప్రా డిప్రెషన్ తో బాధపడుతుందట. ఈ సమస్యను అధిగమించేందుకు ఆమె తరచూ డాక్టర్స్ ను సంప్రదిస్తుందని ఆమె వెల్లడించింది.
READ ALSO : Ravindra Jadeja: పాపం జడేజా.. బీజేపీ నుంచి భార్య.. కాంగ్రెస్ నుంచి సోదరి..