Advertisement
ఒక సినిమా సూపర్, డూపర్ హిట్ అవ్వాలంటే ఆ సినిమాకి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. హీరోయిన్ అందాలు, ఆమె కోసం హీరో పడుతున్న బాధలు ఇలా ఎన్నెన్నో కథలను మనం చూసాం. కేవలం స్కిన్ షోలు చేస్తే స్టార్లు అయిపోతారు అనుకుంటే ముంబై బ్యూటీలు చాలామంది స్కిన్ షోలకు రెడీగా ఉన్నారు. కానీ నటిగా ప్రూవ్ చేసుకుని, కథకి ప్రాధాన్యత కలిగిన పాత్రలు ఎంపిక చేసుకున్నప్పుడే కొంతమంది స్టార్లు ఎదిగారు. మరి కొంతమంది అయితే స్కిన్ షోపై ఆధారపడకుండా నటనతో స్టార్లు అయ్యారు. అలాంటి నటీమణులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి.
Advertisement
READ ALSO : ఆచార్య ఒరిజినల్ స్టోరీ ఇదే.. ఇలా తీసి ఉంటే హిట్టేనట ?
#1 సుహాసిని:
తమిళ నటి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిగా పాపులర్ అయింది.
#2 శోభన:
కళ్ళతోనే మాయ చేయగల నటి. ఎటువంటి పాత్ర ఇచ్చిన అందులో పరకాయ ప్రవేశం చేసేస్తుంటుంది.
#3 జయసుధ:
ఈమె గ్లామర్ పాత్రలు చేయలేదు అని కాదు, గ్లామర్ షో చేయలేదు అని కాదు.
#4 భానుప్రియ:
ఈమె కూడా జయసుధ లానే. మొదట్లో గ్లామర్ షో చేసిన తర్వాత తన నటన పైనే ఆధారపడి స్టార్ హీరోయిన్ అయింది.
#5 రేవతి:
ఈమెకు ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి జీవం పోస్తుంది అనడంలో సందేహం లేదు.
Advertisement
#6 రాధిక:
ఈమె చేయని పాత్రలు అంటూ లేవు ఈమె నటన ప్రేక్షకులను కట్టిపారేస్తుంటుంది.
#7 ఆమని:
మిడ్ రేంజ్ హీరోల సరసన చేసిన సినిమాలతోనే ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది.
#8 సౌందర్య:
తక్కువ టైం లోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకొని కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ కు కొత్త డెఫినేషన్ చెప్పింది.
#9 స్నేహ
టాలీవుడ్ కు మరో సౌందర్య అని ఈమె గురించి చెప్పుకునే వారు.
#10 నిత్యా మీనన్:
తన టాలెంట్ తోనే గొప్ప నటిగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
#11 ఐశ్వర్య రాజేష్:
ఆమె బెస్ట్ పెర్ఫార్మర్ లిస్టులో టాప్ పొజిషన్ లోనే ఉంటుంది.
#12 సాయి పల్లవి:
లేడీ పవర్ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న సాయి పల్లవి కూడా అద్భుతమైన నటి.
#13 నజ్రియా ఫహాద్:
ఈమె కూడా నటనకే ప్రాధాన్యతని ఇస్తుంది. అందుకే ఇప్పటికి స్టార్ గా రాణిస్తుంది.
READ ALSO : వర్మ-చిరంజీవి సినిమా షూటింగ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది !