Advertisement
సినీ ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎవరికి ఎలాంటి హిట్ పడుతుందో మనం చెప్పలేం. ఏ సినిమాలో ఎంత ఉంది అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. సినిమా కదా బాగుంటే, నటన నచ్చితే సినిమా ఏ విధంగా రిలీజ్ అయిన ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎంతటి స్టార్ హీరో, హీరోయిన్ అయినా సరే కథ, నటన బాగా లేకుంటే సినిమా హిట్ అవడం చాలా కష్టం. అంతా అందంగా హోయలోలికించే హీరోయిన్లలో ఇంత క్రూరత్వం కూడా దాగి ఉందా? అనేంతలా కొంతమంది హీరోయిన్లు నెగిటివ్ రోల్స్ ప్లే చేసి కూడా ఔరా అనిపించారు. అలాంటి హీరోయిన్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
READ ALSO : అతడు సినిమాలో సోనుసూద్ పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
#1 రమ్యకృష్ణ:
ఈ లిస్టులో మనం ముందుగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ రమ్యకృష్ణ. ‘నరసింహ’ సినిమాలో రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ నే డామినేట్ చేసే విధంగా ఈమె పాత్ర ఉంటుంది. ఇటీవల వచ్చిన ‘రిపబ్లిక్’ సినిమాలో కూడా రమ్యకృష్ణ విలన్ గా నటించింది.
#2 సమంత:
విక్రమ్ సినిమాలో హీరోగా వచ్చిన ‘పత్తు ఎంద్రాకుల్లా’ మూవీలో విలన్ పాత్రలో కనిపించి మెప్పించింది సమంత. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు.
#3 తమన్నా:
ఇటీవల వచ్చిన నితిన్ ‘మాస్ట్రో’ లో విలన్ పాత్రని పోషించి మెప్పించింది తమన్నా.
#4 రెజీనా:
Advertisement
అడవి శేష్ హీరోగా వచ్చిన ‘ఎవరు’ సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది రెజీనా.
#5 కాజల్:
తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషించింది కాజల్.
#6 పాయల్ రాజ్ పుత్:
‘ఆర్.ఎక్స్.100’ చిత్రంలో విలన్ పాత్రను పోషించి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది పాయల్.
#7 త్రిష:
‘ధర్మయోగి’ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించింది త్రిష.
#8 ప్రియమణి:
‘చారులత’ అనే సినిమాలో ప్రియమణి డబుల్ రోల్ ప్లే చేసింది. అందులో ఓ పాత్ర నెగిటివ్ షెడ్స్ తో కూడుకున్నది.
#9 వరలక్ష్మి శరత్ కుమార్:
‘పందెంకోడి 2’, ‘తెనాలి రామకృష్ణ బీఏబిఎల్’, ‘క్రాక్’ వంటి చిత్రాల్లో విలన్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించింది వరలక్ష్మి శరత్ కుమార్.
Advertisement
READ ALSO : ఉత్తర కొరియా అధ్యక్షుడు తన భార్యకు పెట్టిన 8 కండిషన్స్ !