Advertisement
సినిమాల్లో అవకాశం రావాలంటే అదృష్టం ఉండాల్సిందే. అయితే.. అవకాశాలు వచ్చి.. సినిమా ఫీల్డ్ లో సక్సెస్ అయ్యి.. ఒక స్థాయికి వచ్చేసిన తరువాత స్టార్ హీరోలు ప్రయోగాలు చేయడం.. తమకు నచ్చిన మూవీస్ ని ఒకే చేయడం, సినిమాల్లో తమకు ఏమైనా అభ్యంతకర సన్నివేశాలు ఉంటె వాటికి అబ్ జెక్షన్ పెట్టడం లాంటివి చేస్తుంటారు. తాము నటించబోయే పాత్రని తక్కువగా చూపించడానికి కూడా ఒప్పుకోరు. ఇలాంటి పాత్రల్లో మేము నటించము అని చెప్పేస్తూ ఉంటారు. కానీ, కొందరు మాత్రం తమ హోదాలను పక్కన పెట్టి పాత్రల్లో ఇమిడిపోతారు. ఇలాంటి వారు రియల్ ఇన్స్పిరేషన్ గా ఉంటారు.
Advertisement
అలా టాలీవుడ్ హీరోలు కొంత మంది కాళ్ళు మొక్కే సన్నివేశాలు చేయడానికి కూడా ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. ఇంతకూ వారెవరో చూద్దాం. నారప్ప సినిమాలో వెంకటేష్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో నారప్ప ఊరి ప్రజల కాళ్ళని పట్టుకునే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఈ సన్నివేశంలో నటించడానికి వెంకటేష్ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదట. అలాగే.. ప్రభాస్ కూడా సాలార్ లో ఇలాంటి ఓ సన్నివేశంలో నటించాడు. తన స్నేహితుడు కోసం డార్లింగ్ ప్రభాస్ నారంగి కాళ్ళు పట్టుకుంటాడు.
Advertisement
ఈ సన్నివేశం చేయాల్సి వచ్చినప్పుడు ప్రభాస్ డూప్ పక్కనే ఉన్నారట. ప్రభాస్ ఏమైనా అనుకుంటాడేమో అని.. నేను చేస్తాను సర్ అంటూ ముందుకు వచ్చాడట. కానీ ప్రభాస్ ఏమి పర్లేదు.. నేనే చేస్తాను అని చెప్పి ఆ సన్నివేశానికి ఎలాంటి అబ్ జెక్షన్ పెట్టకుండా చేశారట. అలాగే సూపర్ స్టార్ రజిని కాంత్ కూడా జైలర్ సినిమాలో ఇలాంటి సన్నివేశం లోనే నటించారు. జైలర్ సినిమాలో కొడుకు షూ పోలిష్ చేసే సన్నివేశం ఒకటి ఉంటుంది. దీనికి రజిని ఎలాంటి అభ్యంతరం పెట్టకుండానే నటించారట.
Read More:
శనివారం రోజు ఈ పనులు చేసిన, ఈ వస్తువులు కొన్నా శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు.. జాగ్రత్త!
విజయ్ సినిమాలు ఆడనివ్వకుండా జయలలిత ఎందుకు అడ్డుకున్నారు ? జయ లలిత వల్లే పార్టీ పెట్టాడా ?