Advertisement
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టీటీడీ జేవోలు గౌతమి, వీర బ్రహ్మం ఆరోగ్య శాఖ అధికారులతో గోకులం విశ్రాంతి భవన్లో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. సానిటరీ మెటీరియల్స్ సిబ్బంది పనితీరు వంటి తదితర విషయాల గురించి ఈవో అధికారంతో చర్చించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు పలు సమస్యలను ఈవోకు తెలియజేశారు. భక్తులు క్యూలో విస్తరించిన ప్రాంతంలో తగినంత మంది సిబ్బంది లేకపోవడం వలన పారిశుద్ధ్య పనితీరులో లోపం ఉందని వివరించారు.
Advertisement
సమయానికి శానిటరీ మెటీరియల్స్ ను ఏజెన్సీలు సరిగా సరఫరా చేయకపోవడం, నాణ్యతలేని క్లీనింగ్ సామాన్లు సరఫరా చేయడం వంటి అంశాల గురించి ప్రస్తావించారు. సానిటరీ ఇన్స్పెక్టర్లు చెప్పిన పలు సమస్యలను ఈవో సావధానంగా విని, ఇకపై కాంట్రాక్టర్లను కఠినంగా హెచ్చరించాలని నిబంధనలు ప్రకారం సరిపడా సిబ్బంది, మెటీరియల్ సరఫరా చేసి తిరుమలలో పరిశుభ్రత చర్యలను మెరుగుపరచడానికి మూడు రోజులు సమయం ఇవ్వాలని ఆదేశించారు.
Advertisement
Also read:
Also read:
మూడు రోజుల తర్వాత ఆకస్మికంగా తనిఖీలు చేసేందుకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. తదుపరి చర్యలు తీసుకోవడానికి పారిశుధ్యం పై నివేదిక ఇవ్వాలని జీవోలను ఆదేశించారు. తిరుమల, అలాగే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే భక్తులు కారణంగా సంస్థకు చెడ్డ పేరు వస్తుందన్నారు. ఆరోగ్య విభాగం బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని అవసరాలను యజమాన్యం చూసుకుంటుందని ఆయన చెప్పారు. యాత్రికులు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సమర్థవంతంగా పనిచేయాలని పర్యవేక్షించాలని ఆదేశించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!