Advertisement
సాధారణంగా ఒక సినిమా రావాలి అంటే హీరో హీరోయిన్ తో పాటుగా విలన్ పాత్ర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏది ఏమైనా సినిమాలో హీరో కి ఎంత పాపులారిటీ ఉంటుందో విలన్ కి కూడా అంతే పాపులారిటీ వస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుత సినిమాల్లో విలనిజం పాత్రలకీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
Advertisement
ఈ పాత్ర కోసం ఏరి కోరి కొంతమందిని ఎంపిక చేసుకుంటున్నారు చిత్రయూనిట్. అలాగే ఇప్పటికే కొన్ని సినిమాల్లో మెయిన్ విలన్ పక్కన చేసే ఈ చోటా విలన్స్ కూడా హైలెట్ అవుతూ ఉంటారు.. అయితే తాజాగా అలాంటి విలన్ గురించే ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి ఎవరని మీరు ఆలోచిస్తున్నారు కదూ.. అతనే షేక్ శ్రీను.. తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువ మందికి తెలియక పోవచ్చు కానీ, ఈయన ఫోటో చూస్తే ప్రతి ఒక్కరు గుర్తుపట్టేస్తారు..
also read;చంద్రముఖి అసలు కథ ఇదే.. సినిమా కి వాస్తవానికి తేడా ఇంత వెరిషన్ ఉందా ?
Advertisement
ఎందుకంటే ఇతను ఇప్పటికే చాలా సినిమాల్లో మనం చూశాం.. షేక్ శ్రీను విలన్ పాత్రలో నటించడమే కాకుండా తన బాడీతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అని చెప్పవచ్చు.. విలన్ పక్కన సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న షేక్ శ్రీను బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే అందరూ నోరెళ్లబెడతారు. అయితే శ్రీనుకు బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇష్టమట.. తన బాడీ బిల్డింగ్ తో ఏకంగా జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఈయనకు నటన అంటే కూడా చాలా ఇష్టమట.. ఎన్టీఆర్, మెగాస్టార్ నటన చూసి సినిమాల్లోకి రావాలని అనుకున్నారట.. హీరో అర్జున్, జాకీ చాన్ వంటి వాళ్లను చూసిన తర్వాత విలన్ గా రాణించాలని కోరిక కలిగిందట షేక్ శ్రీను..
ఈ విధంగా ఇండస్ట్రీకి రావడానికి ఆర్టిస్ట్ ప్రసన్నకుమార్ సహాయం తీసుకొని ఎంట్రీ ఇచ్చారట శ్రీను. వచ్చిన కొద్ది కాలంలోనే నరసింహ నాయుడు సినిమాలో విలన్ గా నటించి అదరగొట్టారు.. ఈ నటనతో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ దృష్టిలో పడి శీను సినిమాల్లో కంటిన్యూ అవుతూ వచ్చారు.. అసలు పేరు షేక్ రెహమాన్. దీని తర్వాత అనేక సినిమాల్లో నటించి మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.. అయితే షేక్ శ్రీను గురించి ఎవరికీ తెలియని ఒక విషయం ఉంది. అదేంటంటే వైజాగ్ లో ఆయన పోలీసు విభాగంలో ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండడం మరోక విశేషం.
also read;హీరో వడ్డే నవీన్ భార్య ఎవరో చూస్తే మీ బుర్ర తిరిగిపోద్ది?