Advertisement
నంది అవార్డుల వ్యవహారం తెలంగాణలో ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనుముల అవార్డుల బహుకరణ పై ప్రభుత్వ విధానం ఏంటో గతంలో చెప్పారు అయితే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా స్పందించారు. రేవంత్ చేసిన కామెంట్లు, అందుకు చిరంజీవి ఇచ్చిన సమాధానం గురించి చూద్దాం. డిసెంబర్ 9న గద్దర్ సుమారుగా అవార్డులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సినిమా పరిశ్రమలో బాధ్యత వహిస్తున్న వాళ్లు ఓ ప్రతిపాదనతో రావాలని సూచించారు. వారు అడగకముందే నేను ప్రకటన చేసినా ఎందుకు వారు ముందుకు రాలేదు..? ప్రభుత్వంతో సంప్రదింపులు చేయలేదు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Advertisement
Advertisement
నంది అవార్డుల కంటే ఘనంగా గద్దర్ అవార్డులు ఇస్తామని తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన రోజున అవార్డులు ఇవ్వాలని అనుకున్నాం. కానీ సినీ ప్రముఖుల నుండి స్పందన రాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ తెలుగు సినిమా ప్రపంచంలోనే గుర్తింపు పొందుతోంది. ప్రభుత్వపరంగా కూడా ప్రోత్సాహం తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చింది.
Also read:
అది కూడా జీవితాంతం ప్రజాసేవ కోసం మార్పు కోసం పాటుపడిన గద్దర్ పేరిట ఇవ్వడం గర్వంగా ఉందని చిరంజీవి అన్నారు. గద్దర్ పేరున అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని, స్వయంగా ఆయన చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!