Advertisement
ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఖర్జూరాన్ని తీసుకుంటే అనేక లాభాలని పొందవచ్చు. ముఖ్యంగా వానా కాలంలో ఖర్జూరం తీసుకుంటే అనేక లాభాలు ఉంటాయి. వానా కాలంలో కర్జూరాన్ని తీసుకుంటే ఏఏ లాభాలను పొందవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సీజన్లను బట్టి మనం ఆహార పదార్థాలను మార్చుకోవాలి. వాతావరణ మార్పులు తట్టుకుంటూ శరీరం వ్యాధుల బారిన పడకుండా అవి చూసుకుంటాయి. ఖర్జూరాన్ని తీసుకుంటే ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు రావు. ఇతర అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి కూడా వీటిలో ఉంది.
Advertisement
ఖర్జూరం తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. నిద్రలేమి సమస్యకు ఇది విరుగుడులా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఖర్జూరాల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం, ఎసిడిటీ వంటి జీవన సమస్యల్ని తొలగిస్తుంది. చర్మ సౌందర్యానికి కూడా ఖర్జూరం సహాయపడుతుంది. ఏ వయసు వాళ్ళు అయినా సరే పరగడుపున తీసుకుంటే మంచిది. రక్తహీనత ఉన్న వాళ్ళు మధ్యాహ్నం భోజనం తర్వాత తినాలి.
Advertisement
Also read:
పిల్లలు, యుక్త వయసులో చేరువవుతున్న వాళ్లు మధ్యాహ్నం పూట తీసుకుంటే మంచిది. వానా కాలంలో ఎక్కువగా చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే జుట్టు కూడా రఫ్ గా మారిపోతుంది. శరీరంలో విటమిన్ బీ6 లోపానికి కారణం ఇది. అందుకని ఖర్జూరాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. కాల్షియం, మెగ్నీషియం కూడా ఇందులో సమృద్ధిగా ఉంటుంది. కొవ్వును కరిగించి చక్కటి శరీరాకృతిని కూడా ఇస్తుంది.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!