Advertisement
తమిళ ఇండస్ట్రీ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతో పేరు సంపాదించారు హీరో ధనుష్.. తనదైన నటనతో అందరినీ మెప్పించి ఆకట్టుకుంటారు ఆయన.. అలాంటి హీరో ఒకానొక సమయంలో కనీసం ఒక పూట అన్నం తినడానికి కూడా దిక్కు లేని పరిస్థితి అనుభవించారట.. మరి ఆయన జీవితంలో ఏ విధంగా ఎదిగారో ఓ సారి చూద్దాం..? ధనుష్ కస్తూరి రాజా, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. ధనుష్ కి ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య సెల్వరాఘవన్ ఉన్నారు. ఆయన కూడా దర్శకుడు. ఆయన తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే,7/G బృందావన కాలనీ, సినిమాలకు దర్శకుడిగా చేశారు.
Advertisement
ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా తమిళంలో స్టార్ డైరెక్టర్. మంచి రైటర్ కూడా, ధనుష్ జన్మించేనాటికి వీరి కుటుంబం కటిక పేదరికం లో ఉంది. ధనుష్ తండ్రి ఒక మిల్లులో పని చేస్తూ ఎంతో కష్టపడే వారు. వీరంతా ఒక చిన్న గదిలో ఉండే వారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రోజుకు ఒక్క పూట కూడా తినలేని పరిస్థితి ఉండేది. కస్తూరి రాజా ఒక్క రూపాయి బస్ చార్జి మిగిలడం కోసం పదకొండు కిలోమీటర్లు నడిచి వెళ్లే వారు. ధనుష్ ఐదు సంవత్సరాలు వచ్చే దాకా ఈ పరిస్థితి కొనసాగింది. కస్తూరి రాజా మిల్లులో పనిచేసే సమయంలో కథలు రాసేవారు. వాటిని 50 రూపాయలకు ఇతరులకు అమ్మేవారు.
Advertisement
ఈ విధంగా ఆయన రాసిన కథలను ఇతరులు కొనుక్కొని డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు ఎక్కువ రూపాయలకు అమ్ముకొని లాభాలు పొందేవారు. ఈ సందర్భంలోనే ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఇక ఆ విధంగా ఎంతో కష్టపడి డైరెక్టర్ గా ఎదిగారు. ఆ తర్వాత ధనుష్ టెన్త్ క్లాస్ వరకు బాగా చదివి తర్వాత ఇంటర్మీడియట్ లో ఒక అమ్మాయి తో లవ్ లో పడి తన చదువుకు దూరం అయ్యారు. ఇంటర్ ఫెయిల్ అయ్యారు. ఇది గమనించిన ఆయన తండ్రి చదువు రాదు అని చెప్పేసి, ముందుగా నాటకాలకు పంపించి తర్వాత సినిమాల్లోకి తీసుకు వచ్చారు. ఈ విధంగా ధనుష్ అంచలంచలుగా ఎదిగి ఒక స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్నారు.
also read;
దర్శకులని ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులతో విడిపోయిన 4 హీరోయిన్స్ వీరేనా ?