Advertisement
ప్రకాశవంతమైన ఎరుపు రంగు చీరను ధరించి, భక్తులను చిరునవ్వుతో స్వాగతిస్తూ, అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తూ, కోయంబత్తూరులోని లింగ భైరవి ఆలయంలో ఉన్న ఆమె భైరాగిణి మా హనీనే. ఆమె దుస్తులు భారతీయ సంప్రదాయాన్ని చూపిస్తున్నా.. ఆమెని చూస్తే ఓ ఫారినర్ అని ఈజీగా అర్ధం అయిపోతుంది. అమ్మవారి గుణాలను ప్రతిబింబించేలా ఆమె పురోహితురాలిగా నియమితురాలైంది. ఆమె ఒక మహిళ, ఆమె క్రిస్టియన్ మరియు ఆమె విదేశీయురాలు. ఇవన్నీ కాకుండా, తమిళనాడులోని ఈ విశిష్టమైన ఆలయంలో అమ్మవారికి సేవ చేసే పూజారి కూడా. కానీ, ఇదంతా ఎలా సాధ్యమైంది?
Advertisement
భైరాగిణి మా హనీన్ లెబనాన్‌లోని క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసేవారు. కానీ, భారతదేశంలో ఓ విశిష్ట దేవాలయంలో పూజారిగా మారి ఆమె తన జీవితాన్ని మలుపు తిప్పుకున్నారు. ఆధ్యాత్మికత యొక్క మార్గాన్ని అనుసరించాలని, అంతర్గత సంతృప్తిని పొందాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె వయస్సు కేవలం 25 సంవత్సరాలు. “నేను లెబనాన్ నుండి వచ్చాను మరియు నేను గ్రాఫిక్ డిజైనింగ్ చదివాను. నేను ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్‌ని. నేను 2009లో పూర్తి సమయం వాలంటీర్‌గా ఇక్కడికి వచ్చాను మరియు నేను 14 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను” అయినప్పటికీ ఇది నాకు నిన్నా, మొన్నటి సంఘటన లాగానే అనిపిస్తుంది అని ఆమె పేర్కొంది.
Advertisement
నా సన్నిహిత మిత్రుడి మరణంతో నేను జీవితంలో కృంగిపోయాను. చాలా మానసిక వేదనలో మునిగిపోయిన నేను నన్ను నేను వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే నా మనస్సులో ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి. మరియు నేను సమాధానాల కోసం వెతకడం ప్రారంభించాను అని లెబనాన్ చెబుతూ ఉంటారు. నా అన్వేషణలో, నేను సద్గురు గురించి తెలుసుకున్నాను మరియు నేను 2005లో ‘ఇన్నర్ ఇంజినీరింగ్’ (ఈశా యోగా సెంటర్ అందించే ప్రోగ్రామ్) చేసాను. ఆ తరువాత తిరిగి నా కంట్రీ కి వెళ్లి, ఉద్యోగానికి రాజీనామా చేసేసి.. బాగ్ సర్దేసుకుని వచ్చాను. ప్రతి విషయంలో నాకు నేనుగా పని చేసుకుంటూ వచ్చానని.. ఇది నాకు సంతృప్తిని ఇస్తోందని భైరాగిణి మా తెలిపారు. లింగ భైరవి దేవి యొక్క అంశే భైరాగిణి. ఆమె రంగు ఎరుపు. అందుకే మేము ఎరుపు రంగు దుస్తులు ధరిస్తామని ఆమె తెలిపారు. నేను క్రైస్తవురాలిని కావడంతో మొదట నా సన్నిహితులంతా నవ్వారని.. కానీ నాకు ఇది సంతృప్తి ఇస్తుందని అనుభవపూర్వకంగా మాత్రమే తెలిసిందని చెప్పుకొచ్చారు. భారతీయులు ఎవరినైనా ఆనందంగా స్వీకరిస్తానని.. అందుకే నాకు ఇప్పటివరకు మతం మారాల్సిన అవసరం రాలేదన్నారు. నేను ఇప్పటికి క్రిస్టియన్ నే అని, నన్ను ఎవరూ మతం మారమని చెప్పలేదని అన్నారు. నా కుటుంబం కూడా నాకు మద్దతు ఇచ్చిందని, మొదట్లో నేను ఎందుకు చేస్తున్నానో వారికి అర్ధం కాలేదని, కానీ నాలో, నా ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి వారికి కుతూహలం కలిగిందని అన్నారు.