Advertisement
క్రికెట్ మీరు చాలా సార్లు చూసే ఉంటారు. క్రికెటర్లు జెర్సీ వెనుక నెంబర్లు ఉంటాయి అయితే ధోనికి చూసుకున్నట్లయితే 7 అని, విరాట్ కోహ్లీకి 18 అని రాసి ఉంటుంది. అయితే ఎలా ఈ నెంబర్ లని జెర్సీ మీద కేటాయిస్తారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. చాలా మందికి ఈ విషయం తెలియదు. మీకు కూడా తెలియక పోయినట్లయితే ఇప్పుడే తెలుసుకోండి. జెర్సీ నెంబర్లని ఫిక్స్ చేసేటప్పుడు, ఎవరు కూడా ఆ ప్లేయర్ కి ఆ నంబరు ఉండాలని ఫిక్స్ చేయరు కేవలం క్రికెటర్లు మాత్రమే వారి యొక్క జెర్సీ నెంబర్లను ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు.
Advertisement
వాళ్ళే స్వయంగా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అయితే క్రికెటర్లు వారి యొక్క జెర్సీ నెంబర్లని ఫిక్స్ చేసుకున్నప్పుడు ఐసీసీ కానీ బీసీసీఐ కానీ జోక్యం చేసుకోదు. కేవలం పూర్తి హక్కు క్రికెటర్లకి మాత్రమే ఉంటుంది వాళ్లే వారి యొక్క జెర్సీ నెంబర్లను ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే టీంలో ఏ ఇద్దరు వ్యక్తులకి కూడా ఒకే జెర్సీ నెంబర్ ఉండకూడదు కాబట్టి ఒకరు ఎంపిక చేసుకున్న నెంబర్ ని మళ్లీ ఇంకొకరు ఎంపిక చేసుకోవడం అవ్వదు. కాబట్టి అలాంటి నెంబర్ ని మళ్ళీ ఎంపిక చేసుకోకూడదు.
Advertisement
అది కాకుండా ఇంకేమైనా నెంబర్లని ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కువగా ప్లేయర్లు వారి యొక్క లక్కీ నెంబర్లను కానీ సెంటిమెంట్లను బట్టి కానీ నెంబర్ ని ఎంచుకోవడం జరుగుతుంది. సచిన్ టెండుల్కర్ ఇంటి పేరు లో టెన్ అని ఉంటుంది. అదే విధంగా సచిన్ లక్కీ నెంబర్ కూడా 10 అందుకని జెర్సీ నెంబర్ ని 10 గా ఎంపిక చేసుకున్నారు. ధోని పుట్టినరోజు సెవెంత్ జూలై అందుకని ధోని 7 ని ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఒకసారి ఎంపిక చేసుకున్న తర్వాత జెర్సీ నెంబర్ ని అదే ఉంచుకోవాలని ఏమీ లేదు కావాలంటే దానిని మళ్లీ మార్చుకోవచ్చు.
Also read: