Advertisement
నటి మీనా నిన్నటి తరం హీరోయిన్స్ లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా క్యారెక్టర్ నచ్చితే చాలు కచ్చితంగా ఆమె సినిమా చేసేవారు.1982 చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన మీనా అప్పటి నుంచి చాలా లాంగ్వేజ్ లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమె దాదాపు 45 సినిమాల వరకు చేసింది. దీని తర్వాత తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనా తన నటనతో నంది అవార్డు కూడా గెలుచుకున్నారు. ఇక అక్కడ నుంచి ఆమె ఎదురు చూసుకోలేదు. కన్నడ, మలయాళ, హిందీలో అన్ని లాంగ్వేజ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు పొందారు.
Advertisement
Also Read: లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..?
2009లో విద్యాసాగర్ తో మీనా వివాహం జరిగింది. వివాహం తర్వాత కూడా మీనా చాలా సినిమాల్లో నటించారు. మీనా విద్యా సాగర్ లకు ఒక పాప కూడా ఉంది. ఆమె పేరు నైనికా, ఇక అమ్మగా తన పాప భవిష్యత్తు చూసుకుంటూ తన ఫ్యామిలీని లీడ్ చేస్తోంది మీనా. నటి మీనా తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందినప్పటికి హీరోయిన్ గా మాత్రం తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందింది. సినిమా అవకాశాలు తగ్గుతున్న తరుణంలో నెలకు లక్షల రూపాయల జీతం అందుకుంటున్న విద్యాసాగర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మీనా.
Advertisement
ఆమె భర్త విద్యాసాగర్ గురించి చూస్తే దాదాపు ఆయన 7-8 దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేశారు. సుమారు ఆయనకు ఏడాదికి కోట్ల రూపాయల శాలరీ వస్తుంది. ఈయనకు చెన్నై మరియు హైదరాబాదులో కూడా సొంతంగా ప్లాట్లు, ఇండ్లు ఉన్నాయి. వీరిద్దరూ పాపని చాలా బాగా చూసుకుంటారు. వీరిద్దరికీ దాదాపుగా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత సంపాదించినా సినిమాల్లో మీనా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. విద్యాసాగర్ కూడా మీనాకు అన్ని వేళల్లో సపోర్టుగా ఉంటూ సహకారం అందిస్తూ ఉన్నారట.. ఇంతలోనే ఆయన హఠాత్తుగా మరణించడం మీనాకు కోలుకోలేని దెబ్బ గా చెప్పవచ్చు.
ALSO READ: హీరోయిన్ మీనా భర్త మృతికి పావురాలే కారణమా!