Advertisement
నట కిరీటిగా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఏ సినిమా చేసిన తన నటనను హైలైట్ అయ్యేలా చూసుకుంటారు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి దాన్ని పండించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజేంద్రప్రసాద్ చేయని క్యారెక్టర్ లేదు, వేయని పాత్ర లేదు. మేడం సినిమాలో ఈయన లేడీ గెటప్ లో కూడా నటించడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన బాబి – మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా తన పాత్రలో ఎంతగానో ఒదిగిపోయి ప్రేక్షకులని ఆకట్టుకున్నారు రాజేంద్రప్రసాద్.
Advertisement
Read also: “వీరసింహారెడ్డి” సినిమాకి ఇదే మిస్ “వాల్తేర్ వీరయ్య” కి ప్లస్ ఇవేనా ?
Advertisement
అయితే అసలు విషయానికి వస్తే రాజేంద్రప్రసాద్ – ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం ఏంటంటే.. సీనియర్ ఎన్టీఆర్ సొంత ఊరు గుడివాడ దగ్గర నిమ్మకూరు అన్న విషయం మనందరికీ తెలిసిందే. మన నటకిరీటి రాజేంద్రప్రసాద్ ది కూడా ఇదే ఊరు. అంతేకాకుండా ఎన్టీఆర్ – రాజేంద్రప్రసాద్ ఇద్దరి ఇళ్లు కూడా పక్కపక్కనే ఉండేవి. రాజేంద్రప్రసాద్ కు ఊహ తెలిసినప్పటినుండి ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే రాజేంద్రప్రసాద్ నటన మీద ఉన్న మక్కువతో సీనియర్ ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఓసారి రాజేంద్రప్రసాద్ సినిమాల్లోకి రావాలనే ప్రయత్నంలో ఎన్టీఆర్ ని కలిశారు. అప్పుడు రాజేంద్రప్రసాద్ సినిమాలలోకి రావాలంటే ఏం చేయాలని ఎన్టీఆర్ ని ప్రశ్నించారట.
అప్పుడు ఎన్టీఆర్.. ఇండస్ట్రీలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉంటేనే సాధ్యమవుతుందని, కామెడీ నే ప్రధానంగా ఎంచుకొని సినిమాలు చేసి చూడు సక్సెస్ అవుతావని తెలిపారుట. ఆ తర్వాత చెన్నై వెళ్లిన రాజేంద్రప్రసాద్ సినిమా రంగంలో పలు విభాగాలలో పనిచేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఇలా కొన్ని విభాగాలలో పని చేశాక క్రమక్రమంగా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ హీరో అయ్యారు. ఆ తర్వాత కామెడీ హీరోగా ఏ హీరోకు లేని సపరేట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ తనకి ఎన్నో మంచి విషయాలను చెబుతూ ఉండేవారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు రాజేంద్రప్రసాద్.
Read also: అటు కొడుకు ఇటు తండ్రి రెండు జనరేషన్స్ లతో నటించిన పది మంది స్టార్ హీరోయిన్స్ !