Advertisement
రెండు రోజుల కిందట టాలీవుడ్ నటుడు చలపతిరావు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. ఇక ఇవాళ ఉదయం టాలీవుడ్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై.. ఆయనకు వీడ్కోలు పలికారు.
Advertisement
ఇది ఇలా ఉండగా, ఈవీవీ సత్యనారాయణ, చలపతిరావు కుటుంబాలు ఎంతో సన్నిహితంగా ఉండేవి. ఈవివీ కొడుకు నరేష్ నీ హీరోగా అందుకే చలపతిరావు కొడుకు రవిబాబు అల్లరి సినిమాతో పరిచయం చేశారు. ఇక ఆర్యన్ రాజేష్ పెళ్లి కూడా చలపతిరావు దగ్గర ఉండి మరి చేయించారు. అప్పటికే ఈవీవీ కన్నుమూయడంతో ఆర్యన్ రాజేష్ పెళ్లి బాధ్యతను చలపతిరావు భుజాన వేసుకున్నారు.
Advertisement
తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలంలో జేగురుపాడు కి చెందిన అమ్మాయితో నిశ్చితార్థం దగ్గరి నుంచి వివాహం వరకు అన్ని ఆయనే చూసుకున్నారు. అక్కడి ప్రాంత వాసులతో చలపతిరావుకు మంచి సంబంధాలు ఉండటంతో ఆ సంబంధం కుదిరింది. కడియం లో ఉండే నర్సరీ రైతు వెంకన్నతో చలపతిరావు అనుబంధం ఎన్నో ఏళ్ల పాటు సాగింది. ఎప్పుడు కడియం వెళ్లిన వెంకన్న కలిసి వచ్చేవారు. ఈవివి కూడా కడియం దగ్గరలో షూటింగ్ చేసిన వెంకన్న అనే ఆ రైతును కలవకుండా వచ్చేవారు కాదు. చలపతిరావు సొంతంగా తీసిన కొన్ని సినిమాల్లో వెంకన్న నటించారు కూడా.
Read also: కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?