Advertisement
భారీ వర్షాలు వరదల కారణంగా తెలుగు రాష్ట్రాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఏపీలోని విజయవాడ గతంలో ఎప్పుడూ లేనంత విధంగా దెబ్బతింది. విజయవాడ చరిత్రలో ఎప్పుడు చూడని వర్షం కురిసింది. భారీ వర్షాల వలన విజయవాడ మొత్తం జలమయంగా మారింది. ఈ వరదల కారణంగా దాదాపు 50 మందికి పైగా చనిపోయారని ప్రభుత్వాలు చెప్తున్నాయి. నష్టపోయిన వారికి సినీ తారలు సహాయాన్ని అందిస్తున్నారు. 1986లో వరదలు వచ్చిన సమయంలో తెలుగు ఇండస్ట్రీ ఇలానే స్పందించింది. 250 మందికి పైగా అప్పుడు మరణించారు.
Advertisement
సుమారు లక్ష మందికి పైగా నిరాశరులయ్యారు. ఆ సమయంలో సూపర్ స్టార్ కృష్ణ లక్ష రూపాయలు, కృష్ణంరాజు 1.05 లక్షలు, బాలకృష్ణ 2.05 లక్షలు ఇచ్చారు. దాసరి నారాయణరావు లక్ష రూపాయలు, రామానాయుడు 50 వేలు, మెగాస్టార్ చిరంజీవి 50 వేల రూపాయలు ఇచ్చారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు 25 వేలు, అశ్విని దత్ ౧౦౦౦౦, విక్రమ్ యూనిట్ తరపున రెండున్నర లక్షలు ఇచ్చారు.
Advertisement
Also read:
బాలీవుడ్ హీరోలు జితేంద్ర, రాజేష్ కన్నా కూడా తమ వంతు సహాయంగా చెరో లక్ష ఇచ్చారు. రజనీకాంత్, కమల్ హాసన్ 50,000, నగేష్ 10,000 ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ ఒక్కొక్కరు 50,000, విజయశాంతి, మాధవి సుజాత 10,౦౦౦, సిల్క్ స్మిత జయమాలిని 5000 ఇచ్చి అందరికీ సహాయం చేశారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి