Advertisement
ఇదివరకు సినిమా షూటింగ్ లు ఎక్కువ శాతం స్టూడియోలోని జరిగేవి. ఇల్లు, గుడి, బడి, ప్యాలెస్, అడవి ఇలా ఏ లొకేషన్ లో తీయాలన్నా దానికి సంబంధించిన సెట్స్ వేసి షూటింగ్ చేసే వాళ్ళు. అవుట్డోర్ షూటింగ్స్ చాలా తక్కువగా జరుగుతూ ఉండేవి. ఎవరన్నా ధైర్యం చేసి అవుట్డోర్ షూటింగ్ చేయాలని అనుకుంటే వచ్చే జనంతో ఇబ్బందులు ఎదుర్కొనే వారట. అలాంటి ఓ సంఘటన ఎన్టీఆర్ జమున ఎల్. విజయలక్ష్మి హీరో హీరోయిన్లుగా నటించిన రాముడు భీముడు మూవీ టైంలో జరిగింది. మూవీ మొగల్ డి రామానాయుడు నిర్మించిన సినిమా ఇది.
Advertisement
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఒకసారి ఎన్టీఆర్ నాగార్జునసాగర్ వెళ్లాల్సి వచ్చింది అక్కడ షూటింగ్ చేద్దామని రెండు పాటలు బాలన్స్ ఉన్నాయి కదా అని రామానాయుడు చెప్పారట దానికి ఎన్టీఆర్ మీరు చేస్తానంటే మేము కూడా సిద్ధమే అని అన్నారు. సాధారణంగా ఎన్టీఆర్ అందర్నీ బ్రదర్ అని అనేవారు. ఎన్టీఆర్ ని ఎవరైనా బహువచనంతోనే పిలిచే వాళ్ళు కానీ రామానాయుడు ఒక్కరే ఎన్టీఆర్ ని బ్రదర్ అని పిలిచేవారట. నాగార్జునసాగర్ నిర్మాణంలో ఉన్నప్పుడు షూటింగ్ చేయాల్సి వచ్చింది ఏఎన్ఆర్ నటించిన డాక్టర్ చక్రవర్తి చిత్రాన్ని అక్కడ కొంత భాగం తీశారు జనంతో పడలేక తిరిగి వచ్చేసారని రామానాయుడు కి తెలిసింది ఈ పాట అక్కడ తీయాలని ఫిక్స్ అయ్యారు. కనుక అక్కడ పోలీసులు కాంటాక్ట్ చేశారు రామానాయుడు అలా జనాన్ని కంట్రోల్ చేయడం తమ వల్ల కాదని తాము వేరే పని మీద ఉన్నామని రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేయమని పోలీసులు చెప్పారు.
Advertisement
Also read:
ఇదే విషయాన్ని ఎన్టీఆర్ కి చెప్పారు మరేం పర్వాలేదు బ్రదర్ అని మనం చూసుకుందాం పదండి అని బయలుదేరారట. నాగార్జునసాగర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలను నిర్మాత రామ నాయుడు ఒక ఇంటర్వ్యూలో వివరిస్తూ.. షూటింగ్ మొదలు పెట్టే సమయానికి వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారని అందరికీ నమస్కారం చేసి చుట్టూ కవర్ చేసామని మీరు వెనక్కి జరిగి మాకు సహకరిస్తే మా పని చేసుకుంటామని ఎంతో వినయంగా రామారావు జనానికి ఉద్దేశించి అనగానే.. ఒక్కసారిగా అందరూ నిశ్శబ్దంగా ఉన్నారట. అక్కడికి వచ్చిన జనం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సహకరించారు అలా రెండు రోజులు పోలీసులు సహాయం లేకుండా రామారావు మాటతో పాటను పూర్తి చేయగలిగారని రామానాయుడు చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!