Advertisement
Saddula Bathumakamma 2023: బతుకమ్మ పండగని తెలంగాణ ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. తెలంగాణాలో ఆడవారు ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మని తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. వీటిల్లో చివరి రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఇంతకీ ఈ సద్దుల బతుకమ్మని ఎలా తయారు చేస్తారో, చివరి రోజుకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడే తెలుసుకుందాం. సద్దుల బతుకమ్మ పండుగ పితృ అమావాస్య రోజు ప్రారంభం అవుతుంది. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మని చేస్తారు.
Advertisement
అలా ఎంగిలి పూలతో మొదలైన బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తొమ్మిది రోజులు చేసే ఒక్కో బతుకమ్మకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ ఎనిమిది రోజులు ఒకెత్తు అయితే.. ఆఖరి రోజున జరుపుకునే సద్దుల బతుకమ్మ మరొక ఎత్తు. ఈరోజు బతుకమ్మని చాలా పెద్దగా, ఘనంగా ఏర్పాటు చేస్తారు. తంగేడు పువ్వుని తెలంగాణ రాష్ట్ర పుష్పంగా పేర్కొంటారు. ఈ పువ్వులతో బతుకమ్మని ఏర్పాటు చేస్తారు. పెద్ద తాంబూలం ఏర్పాటు చేసి అందులో సద్దుల బతుకమ్మను పేరుస్తారు.
Advertisement
బంతి, తంగేడు, చామంతి, గునుగు పువ్వు, మందారాలు, గులాబీలు ఇలా దొరికిన పూలతో బతుకమ్మని ఘనంగా అలంకరిస్తారు. ఈ బతుకమ్మకు తోడుగా మరో తోడు బతుకమ్మని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ తోడు బతుకమ్మని కొంత చిన్న సైజు లో చేస్తారు. గౌరమ్మని చేసి ఎండు కొబ్బరిలో పసుపు కొమ్ము, వక్క ను పెట్టి.. వాటితో పాటు గౌరమ్మని కూడా పెడతారు. ఈరోజున అమ్మవారికి రకరకాల నైవేద్యాలు పెడతారు. ముఖ్యంగా మలిద ముద్దలను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఇవి కాకుండా రకరకాల పిండివంటలను శక్తీ కొలది తయారు చేస్తుంటారు. సాంప్రదాయ దుస్తులతో సిద్ధమైన ఆడవారు బతుకమ్మకి పూజ చేసుకున్నాక, చుట్టూ తిరుగుతూ ఆడిపాడతారు.
- మరిన్ని Telugu news మరియు రాజకీయ వార్తలు ఇక్కడ చదవండి !