Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాయాబజార్ సినిమా అంటే ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాగానే ఉంది. ఇప్పటికి టీవీల్లో వస్తే కన్నార్పకుండా చూస్తారు. బ్లాక్ అండ్ వైట్ కాలంలో వచ్చినప్పటికీ ఈ సినిమా ఇప్పటి వారి మనసులను కూడా దోచుకుంది. ఇందులో ఉన్న ప్రతి సీన్ లో డైరెక్టర్ క్రియేటివిటీ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఉంది కానీ అప్పుడు టెక్నాలజీ వాడకుండానే గొప్ప గొప్ప సీన్లు తెరకెక్కించారు.
Advertisement
also read:TSPSC paper leakage : రేణుక ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి!
అప్పటి సినిమాటోగ్రాఫర్ మాస్కాస్ బర్ట్ లే, ఆర్ట్ డైరెక్టర్ గోకలే-కళాధర్, దర్శకుడు కె.వి.రెడ్డిలకు గొప్ప నైపుణ్యము ఉందని చెప్పవచ్చు. ఇక ఇందులో ముఖ్యంగా వివాహ భోజనంబు పాటలో ఘటోత్కజూడు భోజనానికి కూర్చుంటాడు. నోరు తెరవగానే ప్లేట్లో ఉన్న లడ్డులన్ని నోట్లోకి వెళ్ళిపోతాడు. లడ్డులు గాల్లో ఎగిరి నోట్లోకి వెళ్లడం అనేది ఒక సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఆ సీన్ ఎలా తీశారు అనేది ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం.. ఆ సీన్ గురించి ఆర్ట్ డైరెక్టర్ కళాధర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు..
Advertisement
also read: జియో యూజర్లకు శుభవార్త.. సరికొత్త క్రికెట్ రీఛార్జ్ ప్లాన్స్..!!
ఈ లడ్డులు గాల్లో ఎగిరినట్లు చూపించడానికి ముందుగా ఆర్ట్ డైరెక్టర్ గోకలే- కళాధర్, ట్రాన్స్పరెంట్ పేపర్ ( పారదర్శక కాగితం)తో ఒక గరాటు (పన్నాల్) రెడీ చేశారు. నటుడు ఎస్.వి.రంగారావు కూర్చున్నప్పుడు ప్లేట్ నుండి ఆ నోటి వరకు గరాటు పొడవు చూసుకొని, లడ్డులను కిందికి వదిలారు, అలా కిందికి ప్లేట్లో పడిన లడ్డూలను ఏ ఆధారం లేకుండా కిందికి పడినట్లు షూట్ చేసి, ఆ షాట్ ని రివర్స్ లో ప్లే చేశారు. ఈ విధంగా ప్లేట్లో నుండి నోటిలోకి లడ్డులు వెళుతున్నట్టుగా కనిపిస్తుందని అన్నారు. ఈ విధంగా ఈ సినిమాలో క్రియేషన్స్ టెక్నాలజీ లేకుండా చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
also read:కట్నం ఇచ్చినా..ఆడపిల్లకు కూడా ఆస్తిలో వాటా.. హైకోర్టు తీర్పు ఏంటంటే..?