Advertisement
ప్రతి ఒక్కరు కెరియర్ పై ఫోకస్ పెట్టాలి. లేదంటే అనవసరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా మంది ప్రేమలో పడిపోవడం వలన కెరియర్ పై దృష్టి పెట్టరు. అది నిజంగా పొరపాటే. అలాగే కొంతమంది కెరియర్ పై పూర్తి దృష్టి పెట్టేసి అస్సలు సమయాన్ని ప్రేమించిన వ్యక్తికి ఇవ్వరు. రిలేషన్ ని బ్రేక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు పొరపాట్లు జరగకూడదు అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు ప్రేమించిన వ్యక్తితో కాసేపు సరదాగా గడపాలి. కెరీర్ విషయం గురించి పార్టనర్ కి అన్ని విషయాలు అర్థం అయ్యేటట్టు చెప్పుకుంటే రెండు బ్యాలెన్స్ గా ఉంటాయి.
Advertisement
Advertisement
ప్రేమ, కెరియర్ లో మొదటి ప్రాధాన్యత కెరీర్ కి ఇవ్వాలి. వారానికి ఒకరోజు ప్రేమకు ఇవ్వండి. ఆ రోజు వారితో కలిసి బయటకు వెళ్లడం లేదంటే సరదాగా సినిమాకు వెళ్లడం వంటివి చేయండి. ఉద్యోగ ఇబ్బందుల గురించి చెప్పొద్దు. ఆఫీస్ లో జరిగిన సంఘటనల గురించి పంచుకోకండి. బంధం మెరుగుపడాలంటే కెరియర్ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కలిసి తీసుకోవాలి.
Also read:
అప్పుడు ఎలాంటి గొడవలు రావు. చాలామంది ఏ విషయాలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటప్పుడు ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. అలాగే కొందరు ఏమైనా సమస్యలు వస్తే వదిలేస్తారు ఇది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడూ కూడా జీవిత భాగస్వామి అని అనుకున్న వ్యక్తిని వదిలేయకూడదు. సపోర్ట్ ఇస్తూ తనకి తోడుగా ఉండాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!