Advertisement
ప్రతి ఒక్క భర్తకి కూడా మంచి భర్త అనిపించుకోవాలని ఉంటుంది. అలానే ప్రతి భార్యకి కూడా మంచి భార్య అని భర్త చేత అనిపించుకోవాలని ఉంటుంది. మీరు కూడా మీ భార్య చేత మంచి భర్త అనిపించుకోవాలని మీరు అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. భర్త అంటే ఏ భార్యకి ఇష్టం ఉండదు..? ఎవరి భర్త వారికి ఎంతో ఇష్టం ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం వాళ్ళు చేసే పనులు భార్యలకి నచ్చకపోవచ్చు సాధారణంగా ప్రతి ఒక్క భర్త కూడా ఉద్యోగం అంటూ వ్యాపారం అంటూ బిజీ గా ఉంటారు.
Advertisement
ఆడవాళ్ళకి బయట ఏం జరుగుతుందనేవి తెలియకపోయి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో కొంచెం బెట్టుగా ఉంటారు స్త్రీలు. అయితే వాళ్ల మనసుని నొప్పించకుండా వాళ్లకి ఏం కావాలో భర్తలు తెలుసుకోవాలి. చాలామంది భర్తలు ఏం చేస్తారంటే ఆమెకు ఏమీ తెలియదు అని వాళ్ళ అభిప్రాయాన్ని కూడా పట్టించుకోరు. కానీ అలా కాకుండా భార్య అభిప్రాయాన్ని కూడా స్వీకరించాలి అప్పుడు సంతోషంగా ఉంటారు. భార్యలు ఒక్కొక్కసారి ఏదైనా కావాలని అడుగుతూ ఉంటారు అలా అడిగినప్పుడు భర్త భార్య అభిప్రాయం మేరకు కొనాలి.
Advertisement
ఒకవేళ కనుక ఆర్థికపరంగా కుదరకపోతే దానిని అర్థం అయ్యేలా చెప్పాలి కానీ ప్రతిదీ నేను కొనను నేను చెయ్యను అని చెప్పకూడదు. ఆడవాళ్ళకి సహాయ పడడం కూడా చాలా ముఖ్యం. నేను ఉద్యోగం చేస్తున్నాను కదా నేనెందుకు చేయాలని చాలా మంది మగవారు అనుకుంటూ ఉంటారు. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా భార్యకి ఏదో ఒక సహాయం చేస్తే వాళ్లు కూడా ఆనందంగా ఉంటారు. నిజానికి మీ కంటే ఎక్కువ పని మీ భార్య చేస్తుంది. పిల్లల విషయంలో కొన్ని నిర్ణయాలని కూడా భార్యకి వదిలేయడమే మంచిది ఇలా కనుక మీరు చేసినట్లయితే కచ్చితంగా మీరు మంచి భర్త అనిపించుకోవచ్చు.
Also read: