Advertisement
ప్రతి ఒక్కరు కూడా అందంగా కనపడడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి మెడ చుట్టూ నల్లగా ఉంటుంది. మీకూ అలానే ఉందా..? ఈ సమస్య నుంచి బయట పడాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. మహిళలకు మెడని శుభ్రం చేసుకోవడంలో అశ్రద్ధ విపరీతమైన నగలు వేసుకోవడం వలన మెడ చుట్టూ మట్టి పేరుకు పోతుంది. మామూలుగా స్నానం చేసి దీనిని తగ్గించుకోలేము. అందుకని మెడ చుట్టూ పేరుకుపోయిన నలుపును తొలగించడానికి వీటిని ఫాలో అవ్వడం మంచిది. నిమ్మరసంలో కొంచెం పంచదార వేసి మెడకు మృదువుగా స్క్రబ్ చేయాలి.
Advertisement
ఇలా చేయడం వలన క్లీన్ అయిపోతుంది. మెడ నల్లగా ఉంటే ఇలా చేయండి. తెల్లగా వచ్చేస్తుంది. పెరుగు కూడా బాగా ఉపయోగపడుతుంది. పెరుగులో కొంచెం పసుపు వేసి మెడ చుట్టూ ప్యాక్ లాగా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. కాఫీ పౌడర్ లో కొంచెం పంచదార వేసి మెడ ని క్లీన్ చేసుకుంటే సులువుగా మట్టి పోతుంది. మెడ తెల్లగా వస్తుంది.
Advertisement
Also read:
కీరాదోస ముక్కతో కొంచెం మసాజ్ చేసుకుంటే కూడా మెడ చుట్టూ ఉండే నలుపు పూర్తిగా పోతుంది. ఇవే కాకుండా మీరు కొంచెం కొబ్బరి నూనె, నిమ్మరసాన్ని మిక్స్ చేసి మెడపై రాస్తే కూడా నల్లధనం పోతుంది. తెల్లగా వస్తుంది. ఓట్ మీల్ కొంచెం తేనె వేసి రాసుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. బేకింగ్ సోడా లో వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకునే మెడ చుట్టూ అప్లై చేస్తే మెడ తెల్లగా వస్తుంది. ఇలా ఈజీగా మెడ చుట్టూ ఉండే నలుపు పోతుంది. పైగా అందంగా మీ మెడ మారిపోతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!