Advertisement
తులసి మొక్కని ప్రతి ఒక్కరు కూడా పూజిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది. రోజు ఉదయం, సాయంత్రం తులసి మొక్కని పూజిస్తే, లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. లక్ష్మీదేవి ఆ ఇంట నివసిస్తుందట. తులసి పూజ చేస్తే, మహాలక్ష్మి విష్ణువుని ప్రసన్నం చేస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి.
Advertisement
తులసి మొక్క ఇంట్లో లేకపోతే అశుభ ఫలితాలు కలుగుతాయని, చాలామంది హిందువులు భావిస్తారు. అయితే ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని సరిగ్గా అవ్వకపోతున్నట్లయితే ఆ ఇంట్లో కృష్ణ తులసి మొక్కని నాటితే కచ్చితంగా పనులు పూర్తవుతాయి. ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది. ఇలా చేస్తే ఏమైనా పని చేసినప్పుడు ఆటంకం వస్తున్నట్లయితే అది తొలగిపోతుంది. మంచి జరుగుతుంది.
Advertisement
మీ పనిలో విజయం ఉంటుంది. అరటి మొక్కను కూడా నాటవచ్చు ఈ రెండు మొక్కలు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచి ఫలితాలు మీకు కనబడుతూ ఉంటాయి. రెండు మొక్కలకి నీళ్లు పోసి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. తులసికి నీళ్లు నైవేద్యంగా పెడితే కూడా మంచిది. ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య వైపు తులసి మొక్కని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మీరు పాటించడం వలన అంతా శుభమే కలుగుతుంది.
Also read: