Advertisement
సీక్రెట్ కెమెరాలను గుర్తిస్తే జాగ్రత్తపడవచ్చు. సీక్రెట్ కెమెరాలను ఎలా కనిపెట్టొచ్చు..? ఏదైనా హోటల్లో లేదంటే ఎక్కడైనా జాగ్రత్తగా ఉండాలి. సీసీ కెమెరాలను గుర్తించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సీసీ కెమెరాలు గుర్తించాలని అనుకున్న..? డౌట్ వచ్చినప్పుడు అయినా ఇలా చెయ్యొచ్చు. రహస్యంగా సీసీ కెమెరాలను అమర్చి అడ్డదారులకు పాల్పడుతున్న వారు ఎక్కువైపోయారు. అయితే గదిలో సీసీ కెమెరాలు ఎక్కడ పెట్టారో తెలుసుకోవాలంటే ఇలా చేయండి. ముందు గదిలో గడియారాలు, ల్యాంప్, పవర్ బ్యాంకులు, USB డ్రైవ్ లు, ఫోటో ఫ్రేమ్స్, బొమ్మలు వంటి వాటిని చెక్ చేయండి.
Advertisement
అలాగే పెన్నులు వంటివి ఏమైనా ఉంటే కూడా చెక్ చేయండి. లైట్స్ అన్నీ ఆపేసి చీకట్లో ఫోన్ కెమెరా ద్వారా చూడండి. అలా చేసినప్పుడు ఫోన్ కెమెరాలో ఏదైనా వెలుగు కనిపిస్తే అది హిడెన్ కెమెరా అని మీరు కనిపెట్టొచ్చు. అలాగే వీటిని కనిపెట్టడానికి హిడెన్ కెమెరా డిటెక్టర్ వంటి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటితో మీరు ఈజీగా కనిపెట్టొచ్చు కొన్ని రకాల సీక్రెట్ కెమెరాలు బ్లూటూత్ ని ఉపయోగిస్తాయి. మీరు బ్లూటూత్ పరికరాల కోసం స్కాన్ చేయడానికి ఆండ్రాయిడ్ ఫోన్ ని ఉపయోగించండి. అప్పుడు కనిపెట్టొచ్చు.
Advertisement
Also read:
కొన్నిసార్లు సీక్రెట్ కెమెరాలు వైఫై నెట్వర్క్ తో పనిచేస్తూ ఉంటాయి. రహస్య కెమెరాలను థర్మల్ డిటెక్టర్ల ద్వారా గుర్తించొచ్చు. ఫోన్ తో ఎవరికైనా కాల్ చేయండి ఆ టైంలో మీకు ఏదైనా శబ్దం లేదంటే వైబ్రేషన్ వినిపించింది అంటే అక్కడ సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేశారని మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ తో మీరు సీక్రెట్ కెమెరాను కనిపెట్టొచ్చు. ఎక్కడైనా మీకు అనుమానం కనుక వచ్చిందంటే ఇలా చెక్ చేయండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!