Advertisement
ఈ రోజుల్లో జనాలకు జాగ్రత్త ఎక్కువ విలువైన పత్రాలను పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ తరం యువతకు జాగ్రత్తలు మరింత ఎక్కువ కాబట్టి ప్రభుత్వాలు కూడా కాస్త జాలి చూపించడం మొదలు పెట్టాయి. ఇలా జాగ్రత్త ఎక్కువై పోగొట్టుకునే వాటిలో పదో తరగతి సర్టిఫికెట్ కూడా ఒకటి. కొందరు దురదృష్టంతో పోగొట్టుకుంటే, మరికొందరు జాగ్రత్త ఎక్కువ పోగొట్టుకుంటారు. మరి పోగొట్టుకుంటే ఎలా తెచ్చుకోవాలి ?
Advertisement
Read Also : ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా కి నెగిటివ్ టాక్ రావడానికి కారణాలు ఇవే!
SSC ఒరిజినల్ సర్టిఫికెట్ పొందడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:
#1 మీ కంప్యూటర్లో వెబ్ పేజీని ఓపెన్ చేయండి.
#2అందులో memos. bseapwebdata. Org వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
#3 అది ఓపెన్ చేయగానే ఎస్.ఎస్.సి బోర్డుకు సంబంధించిన డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ పేజ్ కనిపిస్తుంది.
Advertisement
#4 అందులో మీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఏ సంవత్సరం రాశారు, రెగ్యులరా? సప్లినా? ప్రైవేటా? అని ఉంటుంది.
#5 వాటి కింద ఒక నెంబర్ కోడ్ ఉంటుంది. అందులో టైప్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
#6 ఆ విధంగా మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే, మీ కళ్ళ ముందు మీ ఒరిజినల్ సర్టిఫికెట్ ప్రత్యక్షమవుతుంది.
#7 మీ ఎస్.ఎస్.సి ఒరిజినల్ సర్టిఫికెట్ మీ దగ్గర ఉంచుకోవాలంటే, ఒరిజినల్ సర్టిఫికెట్ కనిపిస్తున్న చోటు ఎడమచేయి వైపు పైన ‘ప్రింట్ దిస్ పేజ్’ పై క్లిక్ చేయండి.
#8 దానిపై క్లిక్ చేయగానే ‘సేవ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
#9 సేవ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ డెస్క్ టాప్ మీకు అనువైన చోట భద్రంగా దాచుకోవచ్చు.
Read Also : జాతీయ జెండాను అవమానించిన రోహిత్..అంటూ నెటిజన్లు ఆగ్రహం..మీరు ఇంత ఫేకా ?