Advertisement
ఈ పానీయాలను తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. చాలా మంది ఈరోజుల్లో కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు, కొందరికి కీళ్ల నొప్పులు తీవ్రంగా వేధిస్తాయి. వాళ్ళు ప్రతి రోజూ కొన్ని రకాల పానీయాలను తీసుకుంటే నొప్పులు కంట్రోల్ అవుతాయి. గ్రీన్ టీ రోజుకి ఒకసారి తీసుకోవడం వలన ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అలాగే కాఫీలో కూడా యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఇది కీళ్ల నొప్పులని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.
Advertisement
ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉదయాన్నే వేడి నీటిలో నిమ్మరసం వేసుకొని తాగండి. ఇది జాయింట్ పెయింట్స్ ని తగ్గిస్తుంది. అలానే మటన్ పాయ సూప్ లేదా చికెన్ సూప్ వంటివి తీసుకుంటే కూడా సమస్య తగ్గుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళకి బాగా ఉపశమనం లభిస్తుంది. పైనాపిల్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఉండే బ్రోమాలిన్ కీళ్ల నొప్పులను తగ్గించగలదు. శరీరంలో తగినంత నీళ్లు ఉన్నట్లు చూసుకోండి.
Advertisement
Also read:
రోజుకి ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు తాగేటట్టు చూసుకోండి. అలాగే పండ్ల తో స్మూతీలను తయారు చేసుకొని తాగితే కీళ్ల నొప్పులకు చక్కగా ఔషధంలా పని చేసి నయం చేయగలదు. మరి కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఎటువంటి పానీయాలు తీసుకోవాలో చూశారు కదా.. మరి ఇక వీటిని ఫాలో అయిపోండి. ఇలా చేశారంటే కీళ్ల నొప్పులు బాధ ఉండదు ఆరోగ్యంగా ఉండవచ్చు. సమస్య నుండి బయటకు వచ్చేయొచ్చు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!